AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెప్పుకోండి చూద్దాం.. ముక్కు-పెదవికి మధ్య ఉండే ఈ భాగాన్ని ఏమంటారో తెలుసా?

మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. ఇందులో మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి. మన బాడీలో ఉన్న ఒక్కో పార్ట్‌ ఒక్కో ప్రత్యేక ఉంటుంది. అలాగే ఒక్కో భాగం ఒక్కొ పని చేస్తుంది. ముఖ్యంగా ముఖం విషయానికి వస్తే, ముక్కుకి పైన పెదవికి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఏమని పిలుస్తారో చాలా మందికి తెలియదు. దాని గురించే మనం ఇప్పుడు తెలుసుకుందాం.

చెప్పుకోండి చూద్దాం.. ముక్కు-పెదవికి మధ్య ఉండే ఈ భాగాన్ని ఏమంటారో తెలుసా?
Unraveling The Mystery Of The Groove Between Nose Lip
Anand T
|

Updated on: Apr 04, 2026 | 5:06 PM

Share

మన శరీరంలోని ప్రతి చిన్న భాగం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం, సైన్స్ దాగి ఉండటం నిజంగా అద్భుతం.మన బాడీలోని ప్రతి పార్ట్‌కు ఒక ప్రత్యేక నామం ఉంటుంది. అలాగే ముఖంలో కళ్ళు, ముక్కు, చెవులు, నుదురు వంటి భాగాలు ఉంటాయి. వాటికి కూడా వాటి స్వంత పేర్లు ఉన్నాయి. కానీ ముక్కుకు పెదవికి మధ్య ఉండే భాగాన్ని ఏమని పిలుస్తారు? అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ భాగాన్ని ఏమని పిలుస్తారు? అది ఎందుకు అంత లోతుగా ఉంటుంది, దాని పని ఏమిటి? అనేది తెలుసుకోవాలని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముక్కు కింద పై పెదవి పైన ఉండే ఆ నిలువు బాగాన్ని ఇంగ్లీష్‌లో ఫిల్ట్రమ్ (Philtrum) అని పిలుస్తారు. ఇంతకు ముందు చెప్పినట్లుగా, ఫిల్ట్రమ్ ఆకారం వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. ప్రజలు ఈ ఫిల్ట్రమ్‌ను అందానికి ఒక కొలమానంగా భావిస్తారు. FDA హెల్త్ వెబ్‌సైట్ ప్రకారం.. ఫిల్ట్రమ్ పొడవు లేదా వెడల్పు అనేది తల్లిదండ్రుల జన్యువులపై ఆధారపడి ఉంటుంది. ఫిల్ట్రమ్ చాలా లోతుగా లేదా అసాధారణంగా పొడవుగా ఉంటే, అది కొన్ని రకాల అరుదైన జన్యుపరమైన సమస్యలను సూచించే అవకాశం ఉంది.

ముఖం మీద ఉండే ఈ ఫిల్ట్రమ్ భాగం సాధారణ చర్మంగా కాకుండా ఎందుకు లోతుగా ఉంటుందని మీకు ఎప్పుడైనా అనిపిస్తే దానికి సమాధానం ఇక్కడ ఉంది. ఈ ప్రాంతంలో అదనపు చర్మం మడత పడి ఉండటం వల్ల మనం మాట్లాడేటప్పుడు పై పెదవి, చుట్టుపక్కల కండరాలు సులభంగా కదలడానికి వీలవుతుంది. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, ఈ ఫిల్ట్రమ్ నోటి కదలికలకు, లేదా పై పెదవి కదలికలకు సహాయపడుతుంది.

ఈ విధంగా, శరీరంలోని ఒక భాగం మరొక భాగాని కంటే భిన్నంగా ఉంటుంది. పెదవుల విషయానికి వస్తే, పెదవులకు ఎప్పుడూ చెమట పట్టదు. పెదవులకు చెమట పట్టకపోవడానికి కారణం, వాటిలో చెమటను ఉత్పత్తి చేసే స్వేద గ్రంధులు ఉండవు. చెమట గ్రంథులు లేకపోవడం వల్లే, వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు పెదవులు చాలా త్వరగా పొడిబారిపోతుంటాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే
దుబాయ్‌లో క్షిపణి దాడి హెచ్చరిక జారీ
దుబాయ్‌లో క్షిపణి దాడి హెచ్చరిక జారీ
గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌కు బిగ్‌ షాకిచ్చిన అత్తాపూర్ పోలీసులు
గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌కు బిగ్‌ షాకిచ్చిన అత్తాపూర్ పోలీసులు
అమెజాన్‌ నుంచి అతిపెద్ద సేల్‌ రాబోతోంది.. భారీ డిస్కౌంట్లు..
అమెజాన్‌ నుంచి అతిపెద్ద సేల్‌ రాబోతోంది.. భారీ డిస్కౌంట్లు..
పాస్‌పోర్ట్ చట్టం తెలుసుకో.. ఒవైసీపై కిషన్ రెడ్డి ఫైర్!
పాస్‌పోర్ట్ చట్టం తెలుసుకో.. ఒవైసీపై కిషన్ రెడ్డి ఫైర్!
సరిగ్గా అలారం పెట్టినట్టు రోజూ ఒకే టైంకి దంచికోడుతున్న వర్షం!
సరిగ్గా అలారం పెట్టినట్టు రోజూ ఒకే టైంకి దంచికోడుతున్న వర్షం!
చిన్నారుల ముక్కు, చెవుల్లో నూనె వేస్తున్నారా? డాక్టర్ల హెచ్చరిక!
చిన్నారుల ముక్కు, చెవుల్లో నూనె వేస్తున్నారా? డాక్టర్ల హెచ్చరిక!
జేసీబీ ఫుల్‌ఫాం ఏంటి? అది పసుపు రంగులోనే ఎందుకు ఉంటుంది?
జేసీబీ ఫుల్‌ఫాం ఏంటి? అది పసుపు రంగులోనే ఎందుకు ఉంటుంది?
మొబైల్ చూస్తూ టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?
మొబైల్ చూస్తూ టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?
క్రూరత్వం పరాకాష్ఠ.. అంగన్‌వాడీ కేంద్రంలో అమానుషం..!
క్రూరత్వం పరాకాష్ఠ.. అంగన్‌వాడీ కేంద్రంలో అమానుషం..!