AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్, బరువు తగ్గడానికి దివ్యౌషధం ఈ మసాలా కిచిడీ.. చలికాలం తప్పక తినాల్సిందే

శీతాకాలంలో చల్లటి వాతావరణం వల్ల శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా కాపాడుకోవడానికి చిరుధాన్యాలు (మిల్లెట్స్) ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా సజ్జలు శరీరానికి సహజసిద్ధమైన వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా.. ఐరన్, ఫైబర్, కాల్షియంలను పుష్కలంగా అందిస్తాయి. బియ్యంతో చేసే కిచిడీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది; కానీ సజ్జలు మరియు పొట్టు పెసరపప్పు కాంబినేషన్‌లో రకరకాల కూరగాయలు జోడించి 'సజ్జల మసాలా కిచిడీ' చేసుకుంటే అటు మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారికి, ఇటు బరువు తగ్గాలనుకునే వారికి ఒక దివ్యమైన అమృతాహారంగా మారుతుంది.

Phani CH
|

Updated on: Oct 30, 2026 | 9:55 PM

Share
కావలసిన పదార్థాలు: రాత్రంతా నానబెట్టిన అర కప్పు సజ్జలు, కడిగి నానబెట్టిన అర కప్పు పెసరపప్పు, 1 కప్పు నిండుగా కూరగాయల ముక్కలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 టీస్పూన్ తాజా అల్లం-వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర – అర టీస్పూన్, 1 బిర్యానీ ఆకు, 3 నుండి 4 చిటికెల ఇంగువ, 2 నుండి 3 రెమ్మల కరివేపాకు, అర టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ గరం మసాలా పొడి, పావు టీస్పూన్‌లో సగం పసుపు, తగినంత కారం, అర టీస్పూన్ సాల్ట్, 3 కప్పుల నీళ్లు, 2 టేబుల్ స్పూన్ల వంట నూనె, కొద్దిగా నెయ్యి,  కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు

1 / 5
తయారీ విధానం: అర కప్పు సజ్జలను నీటిలో శుభ్రంగా కడిగి కనీసం 8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీటిని పూర్తిగా వడకట్టి.. మిక్సీ జార్‌లో నీళ్లు లేకుండా వేసి పల్స్ మోడ్‌లో ఆపుతూ కొద్దిగా రవ్వ రవ్వగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అర కప్పు పెసరపప్పును కూడా శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్‌పై అడుగు మందంగా ఉండే కుక్కర్ లేదా పాత్ర పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత అర టీస్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు వేసి వేయించాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, 3-4 చిటికెల ఇంగువ వేసి ఉల్లిపాయలు ట్రాన్స్‌పరెంట్‌గా మారే వరకు వేపాలి.

2 / 5
ఇప్పుడు 1 టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించి.. తరిగిన పచ్చిమిర్చి, క్యారెట్, బఠాణీ, బంగాళాదుంప, టమాటా ముక్కలు వేసి కలపాలి. ఇందులోనే అర టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ గరం మసాలా, సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి కూరగాయలను 2 నిమిషాలు వేయించాలి. కూరగాయలు వేగిన తర్వాత మిక్సీ పట్టిన సజ్జ రవ్వను, నీరు వంపేసిన పెసరపప్పును వేయాలి. అడుగు పట్టకుండా గరిటెతో అన్నింటినీ వేగంగా బాగా కలుపుకోవాలి.

3 / 5
ఇప్పుడు సరిగ్గా 3 కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. మంటను లో-మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మధ్యమధ్యలో అడుగు అంటకుండా కలుపుతూ ఉడికించాలి. కిచిడీ కాస్త దగ్గరపడిన తర్వాత.. కుక్కర్ మూతను సాధారణంగా పైన పెట్టి (విజిల్ పెట్టకూడదు), మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌కి తగ్గించి ఉడికించాలి. సజ్జ రవ్వను చేత్తో నొక్కి చూస్తే మెత్తగా మారినప్పుడు ఉడికినట్లు లెక్క ఒకవేళ రవ్వ గట్టిగా ఉంటే కొద్దిగా మరిగే వేడి నీళ్లు పోసి కలపాలి.

4 / 5
ఉడికిన తర్వాత తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. చివర్లో 1 టీస్పూన్ నేతిలో వేయించిన జీడిపప్పులను కిచిడీపై వేసి కలపాలి. డైట్‌లో ఉన్నవారు నెయ్యి, జీడిపప్పు వేయకుండా తీసుకోవచ్చు. కిచిడీ చల్లారాక చిక్కబడుతుంది కాబట్టి కాస్త జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే శీతాకాలపు ప్రత్యేక 'సజ్జల మసాలా కిచిడీ' సిద్ధం! వేడివేడిగా తింటుంటే చలికాలంలో శరీరానికి హాయిగా ఉంటూ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్‌కు పరిపూర్ణ పోషకాలను అందిస్తుంది!

5 / 5
Follow Us
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన బాక్సాఫీస్ సెన్సేషన్.. మిస్ అవ్వొద్దు

షుగర్, బరువు తగ్గడానికి దివ్యౌషధం ఈ మసాలా కిచిడీ.. 

ఖరీదైన హ్యాండ్ క్రీములు వద్దు.. నీలి పూలతో ఇంట్లోనే బామ్ తయారీ!

తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త రైల్వే లైన్జ..

సమోసా, మోమోస్ చట్నీ ఇకపై ఎర్రగా కనిపంచదు ఎందుకో తెలుసా

జనవరి తర్వాత దాహం దాహం.. జలమండలి దగ్గర ఉందా పరిష్కారం..?

నల్లగా, కొమ్ముల్లా కనిపించే ఈ కాయల పేరేంటి? అసలెక్కడ పండిస్తారు..

కత్తెర మొద్దుబారిపోయిందా? కొత్తది కొనకుండా ఇంట్లోనే ఇలా సరిచేయండి

నటుడు అసభ్యకరమైన కామెంట్స్ పై హీరోయిన్ రియాక్షన్..

తెలంగాణ యువతలోనూ పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు