మునగాకు కొబ్బరి పచ్చడి..  ఇడ్లీ, దోసెల్లోకి మళ్లీ మళ్లీ తినాలనిపించే రుచితో 

Prasanna Yadla

18 November 2026

Pic credit - Pinterest

మునగాకు, కొబ్బరితో చేసే ఈ పచ్చడి  ఇడ్లీ, దోసెల్లోకి ఎంతో  రుచిగా ఉంటుంది. ఎలా చేయాలంటే? 

మునగాకు, కొబ్బరి పచ్చడి

ఇంకా దీనిలో వేసే కొబ్బరి,  చింతపండు పులుపుతో రుచి మరింత పెరుగుతుంది అసలు పచ్చివాసన కూడా రాదు. 

కొబ్బరి,  చింతపండు పులుపుతో

ఒక కప్పు మునగాకు , పచ్చి కొబ్బరి  తురుము1/2 కప్పు, పచ్చిమిర్చి , చింతపండు , వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా నూనె 2 టేబుల్ స్పూన్లు ఉప్పు రుచికి సరిపడా తీసుకోవాలి. 

కావాల్సిన పదార్థాలు

తాలింపు కోసం అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చిని తీసుకుని వేసుకోవాలి 

 తాలింపు కోసం 

ఇప్పుడు పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి అది బాగా వేడయ్యాక దీనిలో జీలకర్ర, మిర్చి, వెల్లుల్లి వేసి బాగా వేయించండి.

స్టెప్ 1 

ఇక ఇప్పుడు అదే పాన్ లో మునగాకులు కూడా వేసి వేసి పచ్చి వాసన పోయే వరకు తక్కువ మంటపై వేయించుకోవాలి 

స్టెప్ 2

 ఇంకా దీనిలోచింతపండు కూడా వేసి దించాలి ఇది చల్లారాక కొబ్బరి తురుము, ఉప్పు వేసి రోట్లో బరకగా రుబ్బుకోవాలి

స్టెప్ 3

ఇప్పుడు చిన్న పాన్‌లో ఆయిల్ వేసి ఆవాలు, మినప్పప్పు పోపు పెట్టి ఈ  పచ్చడిలో కలిపితే టేస్ట్ పెరుగుతుంది.కంటి చూపు కూడా డబుల్

స్టెప్ 4