AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Social Security Board: జాతీయ సామాజిక భద్రతా బోర్డులో సభ్యుడిగా శ్రీనివాస్ జలిగం

National Social Security Board: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సామాజిక భద్రతా కోడ్–2020 ప్రకారం అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ సామాజిక భద్రతా బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఈ కోడ్ 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర కార్మిక శాఖ తన లేఖలో పేర్కొంది. ఈ బోర్డు మూడేళ్ల కాలపరిమితితో పనిచేయనుంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి ఈ బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

National Social Security Board: జాతీయ సామాజిక భద్రతా బోర్డులో సభ్యుడిగా శ్రీనివాస్ జలిగం
National Social Security Board
Subhash Goud
|

Updated on: Oct 30, 2026 | 10:34 PM

Share

National Social Security Board: దేశంలోని అసంఘటిత రంగ కార్మికులు, గిగ్‌ వర్కర్లు, ప్లాట్‌ఫామ్‌ ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి సంక్షేమం కోసం రెండు జాతీయ సామాజిక భద్రతా బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ బోర్డులకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కార్మికులకు అనుకూలమైన సంక్షేమ పథకాల రూపకల్పన, వాటి అమలును పర్యవేక్షించడం ఈ బోర్డుల ప్రధాన బాధ్యతగా ఉండనుంది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ శుక్రవారం 40 మంది సభ్యులతో అసంఘటిత కార్మికుల కోసం జాతీయ సామాజిక భద్రతా బోర్డును, 22 మంది సభ్యులతో గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల కోసం జాతీయ సామాజిక భద్రతా బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫై చేసింది.

అయితే సామాజిక సంక్షేమం, అనుభవం, అంకితభావానికి గుర్తింపుగా, నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్ మెంబర్‌గా (National Social Security Board Member) శ్రీనివాస్ జలిగం నియమితులయ్యారు. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో జాతీయ సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. ఈ బోర్డులో సభ్యుడిగా రిటైర్డ్ రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్-II (RPFC-II) శ్రీనివాస్ జలిగం నియమాకం అయ్యారు. గతంలో శ్రీనివాస్‌ పేరును పరిశీలిస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అధికారిక లేఖ ద్వారా వెల్లడించింది.

శ్రీనివాస్ జాలిగం RPFC (II) రిటైర్డ్ అధికారిగా సేవలు అందించారు. ప్రస్తుతం ఆయన న్యాయవాదిగా (Advocate) కూడా కొనసాగుతున్నారు. సామాజిక సంక్షేమం పట్ల ఆయన చూపిన అంకితభావం, సుదీర్ఘ అనుభవం, కృషి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ఆయన చేసిన కష్టపడే తత్వం, దూరదృష్టి, నాయకత్వ లక్షణాలకు ఈ నియామకం ఒక తగిన గుర్తింపుగా చెప్పవచ్చు.

జాతీయ సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటు:

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సామాజిక భద్రతా కోడ్–2020 ప్రకారం అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ సామాజిక భద్రతా బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఈ కోడ్ 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర కార్మిక శాఖ తన లేఖలో పేర్కొంది. ఈ బోర్డు మూడేళ్ల కాలపరిమితితో పనిచేయనుంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి ఈ బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

ఈ బోర్డులో సభ్యుల నియామకానికి సంబంధించి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2026 జూలై 3న లేఖ జారీ చేసింది. రిటైర్డ్ రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్-II శ్రీనివాస్ జలిగంను బోర్డులో సభ్యుడిగా పరిశీలిస్తున్నట్లు అందులో పేర్కొంది. సామాజిక భద్రతా కోడ్–2020లోని సెక్షన్ 6(2)(c)(iii) ప్రకారం కేంద్ర ప్రభుత్వం మొత్తం 40 మంది సభ్యులను నామినేట్ చేయనుంది. వీరిలో ఏడుగురు పౌర సమాజానికి చెందిన ప్రముఖ వ్యక్తులకు ప్రాతినిధ్యం కల్పించనున్నారు.

బోర్డు ప్రధాన బాధ్యతలు ఏమిటి?

జాతీయ సామాజిక భద్రతా బోర్డు ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సంక్షేమంపై దృష్టి సారించనుంది. ఇందులో భాగంగా పలు కీలక బాధ్యతలను నిర్వహించనుంద అసంఘటిత రంగ కార్మికుల కోసం కొత్త సామాజిక భద్రతా పథకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయడం.

  • గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సంక్షేమానికి అవసరమైన చర్యలను సూచించడం.
  • కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పనితీరును పర్యవేక్షించడం.
  • రాష్ట్ర స్థాయిలో కార్మికులకు సంబంధించిన రికార్డుల నిర్వహణను సమీక్షించడం.
  • బోర్డు నిధులు, ఖాతాలు, ఖర్చులను పరిశీలించడం.
  • సామాజిక భద్రతా కోడ్ అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం.

అసంఘటిత రంగ కార్మికులకు ప్రయోజనం:

దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం ఈ బోర్డు ప్రధాన లక్ష్యంగా ఉండనుంది. ముఖ్యంగా గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్ ఆధారిత ఉద్యోగులు వంటి వర్గాలకు సంక్షేమ పథకాలు అందించే విషయంలో ఈ బోర్డు కీలక పాత్ర పోషించనుంది. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన విధానాల రూపకల్పన, పథకాల అమలు, వాటి పర్యవేక్షణలో బోర్డు సిఫార్సులు ఉపయోగపడనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us