AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 7 కోట్లతో తీస్తే 4000 కోట్ల కలెక్షన్లు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రికార్డు కలెక్షన్లు సాధించింది. కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా రూ. 4000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులన్నీ తిరగరాసేసింది. ఇప్పుడీ సినిమా కాసేపటి క్రితమే ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: 7 కోట్లతో తీస్తే 4000 కోట్ల కలెక్షన్లు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 30, 2026 | 9:55 PM

Share

ఓటీటీ లవర్స్‌కి ఈ వీకెండ్ పండగే పండగ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వారం పలు కొత్త సినిమాలు సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చాయి. శ్రీ విష్ణు కామ్రేడ్ కల్యాణ్, విజయ్ సేతుపతి సిగ్మా, సందీప్ కిషన్ సిగ్మా, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇమ్మోర్టల్, ఎస్సై యుగంధర్, అవరచన్ & బాయ్స్, డార్క్ ది హెవెన్, మీర్జాపూర్ ది మూవీ లాంటి చిత్రాలతో పాటు అక్క, రుద్రవనం పీఎస్ లాంటి వెబ్ సిరీస్ లు కూడా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటు జస్ట్ కాసేపటి క్రితమే ఒక బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా రూ. 4000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్లలో ఆడియెన్స్ ను సరికొత్త థ్రిల్ అందించిన ఈ మూవీని ఓటీటీలో చూడాలని చాలా మంది చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెర పడింది. ఎట్టకేలకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమాలో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్ లేరు. పైగా ప్రజెంట్ ట్రెండ్ అయిన వీఎఫ్ ఎక్స్ గ్రాఫిక్సులు, యాక్షన్ సీక్వెన్సులు లేవు. స్పెషల్ సాంగ్స్ గట్రా కూడా ఏమీ లేవు. పైగా భారీ బడ్జెట్ సినిమా కూడా కాదాయే. అయినా కేవలం కంటెంట్ తోనే కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు సృష్టించడానికి సిద్ధమైన ఈ సినిమా పేరు ‘అబ్సెషన్’. మే 15న విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఓవరాల్ గా రూ.4000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఇండియాలోనూ ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇలా బాక్సాఫీస్ ను గడగడలాడించిన అబ్సెషన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు హిందీలోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. త్వరలో తెలుగులోనూ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో అబ్సెషన్..

అబ్సెషన్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన బాక్సాఫీస్ సెన్సేషన్.. మిస్ అవ్వొద్దు
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన బాక్సాఫీస్ సెన్సేషన్.. మిస్ అవ్వొద్దు
షుగర్, బరువు తగ్గడానికి దివ్యౌషధం ఈ మసాలా కిచిడీ.. 
షుగర్, బరువు తగ్గడానికి దివ్యౌషధం ఈ మసాలా కిచిడీ.. 
ఖరీదైన హ్యాండ్ క్రీములు వద్దు.. నీలి పూలతో ఇంట్లోనే బామ్ తయారీ!
ఖరీదైన హ్యాండ్ క్రీములు వద్దు.. నీలి పూలతో ఇంట్లోనే బామ్ తయారీ!
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త రైల్వే లైన్జ..
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త రైల్వే లైన్జ..
సమోసా, మోమోస్ చట్నీ ఇకపై ఎర్రగా కనిపంచదు ఎందుకో తెలుసా
సమోసా, మోమోస్ చట్నీ ఇకపై ఎర్రగా కనిపంచదు ఎందుకో తెలుసా
జనవరి తర్వాత దాహం దాహం.. జలమండలి దగ్గర ఉందా పరిష్కారం..?
జనవరి తర్వాత దాహం దాహం.. జలమండలి దగ్గర ఉందా పరిష్కారం..?
నల్లగా, కొమ్ముల్లా కనిపించే ఈ కాయల పేరేంటి? అసలెక్కడ పండిస్తారు..
నల్లగా, కొమ్ముల్లా కనిపించే ఈ కాయల పేరేంటి? అసలెక్కడ పండిస్తారు..
కత్తెర మొద్దుబారిపోయిందా? కొత్తది కొనకుండా ఇంట్లోనే ఇలా సరిచేయండి
కత్తెర మొద్దుబారిపోయిందా? కొత్తది కొనకుండా ఇంట్లోనే ఇలా సరిచేయండి
నటుడు అసభ్యకరమైన కామెంట్స్ పై హీరోయిన్ రియాక్షన్..
నటుడు అసభ్యకరమైన కామెంట్స్ పై హీరోయిన్ రియాక్షన్..
తెలంగాణ యువతలోనూ పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు
తెలంగాణ యువతలోనూ పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు