AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఒట్టు.. ఈ సిరీస్ చూశాక మొబైల్ ముట్టుకోవాలంటే భయపడతారు.. ఓటీటీలో వణుకు పుట్టించే సైబర్ క్రైమ్ థ్రిల్లర్

2026 సంవత్సరానికి గాను అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సిరీస్‌ల జాబితాను ప్రకటించింది IMDB. ఇందులో పలు భాషలకు చెందిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు ఉన్నాయి. అయితే ఈ జాబితాలో టాప్ ప్లేస్ దక్కింది మాత్రం ఓ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు.

OTT Movie: ఒట్టు.. ఈ సిరీస్ చూశాక మొబైల్ ముట్టుకోవాలంటే భయపడతారు.. ఓటీటీలో వణుకు పుట్టించే సైబర్ క్రైమ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 29, 2026 | 10:19 PM

Share

ఓటీటీ ప్రపంచంలో ప్రస్తుతం ఏ వెబ్ సిరీస్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారో అని ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. ఇదే క్రమంలో  2026 సంవత్సరానికి గాను IMDb అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సిరీస్‌ల జాబితాను ప్రకటించింది. బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ రూపొందించిన ఒక సైబర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఆసక్తికరంగా, ‘సప్నే వర్సెస్ ఎవ్రీవన్’, ‘రఖ్’ మరియు ‘ఏకాకి’ వంటి విభిన్న జానర్‌లకు చెందిన సిరీస్‌లు కూడా ఈ జాబితాలో తమదైన ముద్ర వేశాయి. అయితే వెబ్ సిరీస్ రంగంలో రాజ్‌కుమార్ హిరానీ తొలి అడుగు వేసిన ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సిరీస్‌లో రాజ్‌కుమార్ హిరానీ కుమారుడు వీర్ హిరానీ, అర్షద్ వార్సీ, విక్రాంత్ మెస్సీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. క్రైమ్, కామెడీ, థ్రిల్‌లను మిళితం చేసి తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో రికార్డులు కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ వెబ్ సిరీస్ IMDbలో 2026 సంవత్సరపు అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సిరీస్‌ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ‘సప్నే వర్సెస్ ఎవ్రీవన్’ రెండవ స్థానాన్ని, ‘రఖ్’ మూడవ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఆశిష్ చంచలానీ సీరియల్ ‘ఏకాకి’ నాలుగవ స్థానంలో నిలిచింది. ‘టస్కారి: ది స్మగ్లర్స్ వెబ్’ ఐదవ స్థానాన్ని దక్కించుకుంది. ఇది కాకుండా, ‘ముసాఫిర్ కేఫ్’, ‘మిర్జాపూర్’, ‘చిరయ్యా’, ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’, ‘ఆదర్శ బాల విద్యాలయ’ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

గత కొన్నేళ్లుగా, భారతీయ OTT రంగంలో క్రైమ్ థ్రిల్లర్లు, కామెడీలు, హారర్, కుటుంబ కథలు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందుతున్నాయి. ఈ క్రమంలోనే ‘ప్రీతమ్ & పెడ్రో’ వెబ్ సిరీస్ కు ఐఎమ్ డీబీ లిస్టులో అగ్రస్థానం సంపాదించిందని చెప్పవచ్చు. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. గోవాలో తన తాతయ్యతో కలిసి జీవిస్తుంటాడు ప్రీతమ్. వాక్యూమ్ క్లీనర్స్ సేల్స్ మ్యాన్‌గా పని చేస్తుంటాడు. ఒక రోజు తన తాతకు ఎంతో ఇష్టమైన టేప్ రికార్డర్ కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. అక్కడ పెడ్రో అనే వ్యక్తి ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుంటాడు. ప్రీతమ్ వచ్చిన సమయంలోనే అదే స్టేషన్ కు ఒక హై-ప్రొఫైల్ ఏటీఎం దొంగతనం కేసు వస్తుంది. దాన్ని ఎలా ఛేదించాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటారు. అప్పుడు ప్రీతమ్, తనకు తన టేప్ రికార్డర్ తెచ్చి పెడితే ఏటీఎం దొంగలను పట్టుకుంటానని చెబుతాడు. అందుకు పోలీసులు కూడా ఒకే అంటారు. చెప్పినట్లుగానే ప్రీతమ్ తన కంప్యూటర్‌ను ఉపయోగించి కేవలం పది నిమిషాల్లో ఏటీఎం దొంగల ఆచూకీని కనుగొంటాడు. సరిగ్గా అదే సమయంలో, క్రీడల మంత్రి కుమారుడు అదృశ్యమవుతాడు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. అసలు ప్రీతమ్ గతం ఏంటి? ఏటీఎం దొంగలను ఎలా పట్టుకున్నాడు? ఎందుకు టెక్నాలజీని వదిలేసి సేల్స్ మ్యాన్‌గా వర్క్ చేస్తున్నాడు? అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలసిందే.

ప్రస్తుతం ప్రీతమ్ అండ్ పెడ్రో వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సగటున 35 నిమిషాల నిడివి ఉంటుంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

ప్రీతమ్ అండ్ పెడ్రో వెబ్ సిరీస్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
'బ్లాక్ మిల్క్'.. హీరోయిన్ అదాశర్మ అందానికి కారణమిదే.. వీడియో
'బ్లాక్ మిల్క్'.. హీరోయిన్ అదాశర్మ అందానికి కారణమిదే.. వీడియో