AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupama: ఆ టాలీవుడ్ హీరో చాలా అందగాడు.. ఆయనంటే నాకు కూడా క్రష్.. మనసులో మాట బయట పెట్టిన అనుపమ

ఓవైపు యంగ్ హీరోల సినిమాల్లో హీరయిన్ గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనూ మెప్పిస్తోంది అనుపమా పరమేశ్వరన్. తాజాగా తెలుగులో ఆమె నటించిన చిత్రం 'క్రేజీ కల్యాణం'. దసరా కానుకగా రిలీజైన ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడుతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా అనుపమ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Anupama: ఆ టాలీవుడ్ హీరో చాలా అందగాడు.. ఆయనంటే నాకు కూడా క్రష్.. మనసులో మాట బయట పెట్టిన అనుపమ
Anupama Parameswaran
Basha Shek
|

Updated on: Oct 28, 2026 | 9:27 PM

Share

పేరుకు మలయాళం హీరోయినే అయినా ఇప్పుడు తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది అనుపమా పరమేశ్వరన్. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా గ్లామరస్ పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత క్రమంగా మారిపోయింది. కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది అనుమప. గతేడాది ఏకంగా ఆరు సినిమాల్లో నటించి మెప్పించింన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ఆడియన్స్ ను పలకరించింది. అలా అనుపమ నటించిన లేటెస్ట్ సినిమా ‘క్రేజీ కల్యాణం’. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఓ మోస్తరుగా ఆడుతోంది. ఈ రోజుల్లో పెళ్లి అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిట్లు తెలుస్తోంది. బద్రప్ప గాజుల తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమతో పాటు నరేష్‌ వీకే, తరుణ్‌ భాస్కర్, అఖిల్‌ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరైంది అనుపమ. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఒక్క మాటలో చెప్పమని అనుపమ పరమేశ్వరన్‌ను అడిగింది యాంకర్. దీనికి అనుపమ స్పందిస్తూ.. ‘మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్‌, అందగాడు. సో లవింగ్లీ.. ఆయన గురించి చెప్పడానికి ఏమీ లేదు. మహేష్ అంటే నాకు క్రష్’ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్ర చేసే అవకాశం వస్తే అంగీకరిస్తారా? అని అడగ్గా.. అనుపమ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ‘ మహేష్ సినిమాలో విలన్ పాత్ర అయినా చేయడానికి సిద్ధమే. కానీ మహేష్ బాబును కోపంగా చూడాల్సి వస్తే బహుశా నేను రొమాంటిక్ గా చూస్తానేమో. ఆయన నా వైపు చూస్తూ ఉంటే అసలు నేను యాక్టింగే మర్చిపోయే అవకాశం ఉంది’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది అనుపమ. ప్రస్తుతం ఈ మలయాళం కుట్టీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

ఇక అనుపమ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తోన్న ‘భోగి’ సినిమాలో కథానాయికగా చేస్తోందీ అందాల తార. సంపత్ నంది తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవల రిలీజైన భోగి గ్లింప్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే భోగి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us