AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీని ఊపేస్తోన్న మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోకి కూడా.. IMDBలో టాప్ రేటింగ్

గత వారమే ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే కేవలం ఒరిజినల్ మలయాళం వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కు రాగా.. తాజాగా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు టాప్ రేటింగ్ దక్కడం విశేషం.

OTT Movie: ఓటీటీని ఊపేస్తోన్న మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోకి కూడా.. IMDBలో టాప్ రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 27, 2026 | 9:38 PM

Share

ఓటీటీలో మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలనైతే ఎగబడి మరీ చూస్తుంటారు ఆడియెన్స్. అలా గత వారం ఓటీటీలోకి వచ్చిన ఒక మలయాళం సినిమా ఇప్పుడు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ స్టోరీ, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఊహించని ట్విస్టులతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కథ అంతా రూబెన్ అనే ఒక సాధారణ యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఒక దారుణమైన రోడ్డు ప్రమాదంలో గాయపడిన రూబెన్‌ను వైద్యులు ‘బ్రెయిన్ డెడ్’ గా ప్రకటిస్తారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ అతను కోమా నుంచి స్పృహలోకి వస్తాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. కోమా నుంచి మేల్కొన్న తర్వాత రూబెన్‌కు ఒక విచిత్రమైన, అసాధారణమైన శక్తి లభిస్తుంది. అతని చెవులకు చుట్టుపక్కల ఉండే ప్రతి చిన్న శబ్దం కూడా అత్యంత స్పష్టంగా, విపరీతమైన తీవ్రతతో వినిపించడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటాడు రూబెన్. దీంతో ఆసుపత్రిలో తనను కోమా నుంచి బయటకు తీసుకురావడానికి కారణమైన ఒక నర్స్ వాయిస్‌ను వెతుక్కుంటూ బయలుదేరతాడు హీరో. ఈ క్రమంలో అనుకోకుండా ఒక ప్రమాదకరమైన నేర ప్రపంచంలోకి అడుగు పెడతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? రూబెన్ తన సమస్యలను పరిష్కరించుకున్నాడా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోన్న ఈ మలయాళం సినిమా పేరు ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’ (It’s a Medical Miracle). థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా గత వారమే ఓటీటీలోకి వచ్చింది.అయితే కేవలం మలయాళం వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కు రాగా ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడల్లోనూ ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’ సినిమాకు శ్యామిన్ గిరీష్ దర్శకత్వం వహించారు. ‘ప్రేమలు’ ఫేమ్ సంగీత్ ప్రతాప్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే షరాఫుద్దీన్, అఖిల భార్గవన్, కొట్టాయం నజీర్ తదితరులు వివిధ పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ’మనోరమ మ్యాక్స్’ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఒక కొత్త కాన్సెప్ట్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఆస్వాదించాలనుకునే వారికి ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’ మూవీ ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us