AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: హౌస్ లో ఆ ఇద్దరు చాలా స్మార్ట్.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 విన్నర్ ఎవరో చెప్పేసిన దక్షి

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఏడో వారం ఎలిమినేషన్ లో భాగంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది దక్షి గుత్తికొండ. హౌస్ లో కేవలం రెండు వారాలే ఉన్న ఆమె పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే బయటకు వచ్చిన దక్షి బిగ్ బాస్ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Bigg Boss Telugu 10: హౌస్ లో ఆ ఇద్దరు చాలా స్మార్ట్.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 విన్నర్ ఎవరో చెప్పేసిన దక్షి
Bigg Boss Telugu 10 Dakshi
Basha Shek
|

Updated on: Oct 26, 2026 | 8:18 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హోరా హోరీగా సాగుతుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా దాదాపు 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఎనిమిదో వారం రన్ అవుతోంది. కాగా ఏడో వారం ఎపిసోడ్ లో భాగంగా ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ లో సత్తా చాటిన షాలినీ పటేల్ తో పాటు వైల్డ్ కార్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన దక్షి గుత్తి కొండ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. కాగా స్వతహాగా మంచి నటి అయిన దక్షి గుత్తి కొండ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో సత్తా చాటింది. ఆ తర్వాత ఐదోవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలా హౌస్‌లోకి వచ్చింది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి ఆమె ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అటు ఫిజికల్ టాస్కులు ఆడక, ఇటు మిగిలిన కంటెస్టెంట్స్‌తోనూ సరిగా కలవలేకపోయింది. దీంతో సహజంగానే ఆమెకు తక్కువ ఓట్లు పడ్డాయి. మొదటి వారం ఎలాగోలా ఎలిమినేషన్ తప్పించుకున్న దక్షి వరుసగా రెండు వారాలు నామినేట్ కావాల్సి వచ్చింది. అయితే ఈ వారంలోనే ఆమెకు చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాక తప్పలేదు. కాగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యిన దక్షికి అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. ఇక ఇంటర్వ్యూలు కూడా బాగానే ఇస్తోంది దక్షి. ఈ నేపథ్యంలో తన బిగ్ బాస్ జర్నీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది దక్షి. అలాగే ఈ సీజన్ విన్నర్ ఎవరన్న దానిపై కూడా తన అభిప్రాయం చెప్పింది.

‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో రోహిత్, త్రిగుణ్ చాలా స్మార్ట్. ఇద్దరు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేముందు త్రిగుణ్ పై నెగెటివ్ అభిప్రాయం ఉండేది. రోహిత్ పై పాజిటివ్ ఒపీనియన్ ఉండేది. కానీ హౌస్ లోకి వెళ్లాక నా అంచనా తప్పైంది. ఎందుకంటే త్రిగుణ్ అగ్రెసివ్ గా ఉన్నా వెంటనే అందరితో కలిసిపోతాడు. ఎవరికీ ప్రాబ్లమ్ వచ్చినా కలిసి కూర్చోని సాల్వ్ చేస్తాడు. కానీ రోహిత్ లో ఆ గుణం లేదు. ఎవరైనా తనతో గొడవపడితే మళ్లీ వారితో మాట్లడడు.. కలవడు.. సో.. త్రిగుణే బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది దక్షి.

ఇవి కూడా చదవండి

దక్షికి స్వాగతం పలుకుతోన్న అభిమానులు..

కాగా బిగ్ బాస్ హౌస్ లో కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది దక్షి. ఈమెకు వారానికి రూ.2.5 లక్షలకు అగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అలా మొత్తం రూ.5 లక్షల పారితోషికం అందుకున్నట్లు టాక్.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us