AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ఆ హీరోనే నా లక్కీ ఛార్మ్.. ఆల్ టైమ్ ఫేవరెట్ స్టార్.. ఆయనతో చేసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్సే

స్టార్ హీరోయిన్ సమంత తెలుగు, తమిళం భాషల్లో ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. మరి సినిమా ఇండస్ట్రీలో ఆమెకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? తాజాగా ఇదే ప్రశ్నకు ఒక ఆసక్తికరమైన సమాధానం చెప్పింది సామ్. ఓ స్టార్ హీరోపై తెగ ప్రశంసలు కురిపించింది.

Samantha: ఆ హీరోనే నా లక్కీ ఛార్మ్.. ఆల్ టైమ్ ఫేవరెట్ స్టార్.. ఆయనతో చేసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్సే
Samantha
Basha Shek
|

Updated on: Oct 23, 2026 | 7:14 PM

Share

‘మా ఇంటి బంగారం’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టింది సమంత. నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇదిల ఉంటే సామ్ ప్రస్తుతం గర్భంతో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆమె అమ్మగా ప్రమోషన్ పొందనుంది. అయితే గర్భంతో ఉన్నప్పటికీ ప్రస్తుతం బుల్లితెరపై ‘సెలబ్రిటీ మాస్టర్‌షెఫ్ తమిళం’ అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది సామ్. సోనీ విళా, సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ప్రసారమవుతున్న ఈ షోలో సమంత తనదైన హోస్టింగ్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ షోకు సంబంధించిన అప్ కమిండ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. ఇందులో భాగంగా ఆర్జే విజయ్ సమంతకు ఒక ప్రశ్న వేశాడు. ‘ సినిమా ఇండస్ట్రీలో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ స్టార్ ఎవరు?’ అని అడగ్గా సమంత వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి, సూపర్ స్టార్ సి. జోసెఫ్ విజయ్ పేరు చెప్పింది. సినిమా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి రావడం, ఈ స్థాయికి ఎదగడం సామాన్యమైన విషయం కాదని, విజయ్ ఎందరికో స్ఫూర్తిదాయకమని దళపతిపై ప్రశంసలు కురిపించింది సామ్.

“విజయ్ సార్ అంటే నాకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆయన నా లైఫ్‌లో పక్కా ‘లక్కీ చార్మ్’. ఆయనతో కలిసి నేను చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఒక నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న తర్వాత, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వెండితెరకు దూరమై పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం అనేది అంత తేలికైన నిర్ణయం కాదు. సినిమాలను పక్కనబెట్టి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పాలన వైపు అడుగులు వేయడం, నిశ్శబ్దంగా వెనుక ఉండి తీవ్రంగా శ్రమించడం నిజంగా గొప్ప విషయం. శ్రమించే తత్వానికి, పట్టుదలకు విజయ్ సార్ ఒక గొప్ప ఉదాహరణ. సరైన సమయంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చి తన మార్క్ చూపించారు’ అని విజయ్ గురించి గొప్పగా చెప్పింది సామ్. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా సమంత, విజయ్ కాంబినేషన్‌లో మొత్తం మూడు సినిమాలు రాగా అన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. 2014లో వచ్చిన ‘కత్తి’ ‘తేరి (2016), మెర్సన్ (2017) సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించాయి. ముఖ్యంగా ‘మెర్సల్’ మూవీ ఏకంగా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది.

ఇవి కూడా చదవండి
Samantha, Cm Joseph Vijay

Samantha, CM Joseph Vijay

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us