AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Sreemukhi: మీరంటే నాకు చాలా ఇష్టం.. ఆ హీరోకు ప్రపోజ్ చేసిన శ్రీముఖి.. పాపం రిప్లై ఏం వచ్చిందంటే?

ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు. తన అందం, వాక్చాతుర్యంతో అందరినీ ఇట్టే కట్టిపడేస్తోందీ బుల్లితెర రాములమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడు పలు టీవీ షోస్, ఈవెంట్స్ కు హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

Anchor Sreemukhi: మీరంటే నాకు చాలా ఇష్టం.. ఆ హీరోకు ప్రపోజ్ చేసిన శ్రీముఖి.. పాపం రిప్లై ఏం వచ్చిందంటే?
Anchor Sreemukhi
Basha Shek
|

Updated on: Oct 22, 2026 | 8:48 PM

Share

స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై పలు షోలు, ఈవెంట్లతో తనదైన శైలిలో ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతోందీ అందాల తార. ఓవైపు టీవీ షోస్, ఈవెంట్స్ చేస్తూనే మరోవైపు అప్పుడుప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తోందీ బుల్లితెర రాములమ్మ. ఇటీవల ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2’ కార్యక్రమానికి హోస్ట్‌గానూ వ్యవహరించి తనదైన శైలిలో ఆకట్టుకుంది శ్రీముఖి. ఇదిలా ఉంటే తాజాగా ఈ యాంకరమ్మ హోస్ట్ గా చేస్తోన్న ఓ టీవీ షోకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గెస్టుగా హాజరయ్యాడు. ముక్కు అవినాష్, ఎక్స్ప్రెస్ హరి , యాదమ్మ రాజు వంటి స్టార్ కమెడియన్స్ కూడా ఈ షోలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గెస్టుగా వచ్చిన తమన్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమన్, శ్రీముఖిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందులో భాగంగానే ఓ మెగా హీరోకు లైవ్ లో ప్రపోజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది శ్రీముఖి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రోమో విషయానికి వస్తే.. సినిమా ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చెప్పండి అని తమన్ ను అడిగింది శ్రీముఖి . అఖిల్, సాయి ధరమ్ తేజ్ పేర్లను చెప్పాడు తమన్. ఆ వెంటనే శ్రీముఖి మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ కి ఇప్పుడే ఫోన్ చేసి అర్జెంటుగా ఒక లక్ష రూపాయలు కావాలని అడగండి అని టాస్క్ ఇచ్చింది. తమన్ శ్రీముఖి చెప్పినట్టు సాయిధరమ్ తేజ్ కి ఫోన్ చేసి.. ‘నువ్వు నా ఫ్రెండేనా ?అని అడిగాడు. దానికి సాయి ధరంతేజ్ ‘కాదు’ అని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.

ఆ తర్వాత తమన్ మాట్లాడుతూ ‘నేను ఏదైనా సహాయం అడిగితే చేస్తావా లేదా అని అడగ్గా.. సాయి చేస్తానని చెప్పాడు. అప్పుడు తమన్ ‘నాకు ఒక లక్ష రూపాయలు కావాలి. పొద్దున్నే ఇచ్చేస్తాను’ అని అడిగాడు. ‘ఇంత ఫాస్ట్ గా ఎలా ఇస్తావురా’ అని సాయిధరమ్ తేజ్ అడిగితే శ్రీముఖి.. నా ఫ్రెండ్స్ దగ్గర తెచ్చి ఇస్తానని చెప్పు అని సైలెంట్ గా చెబుతుండగానే అవతలివైపు నుంచి సాయిధరమ్ తేజ ఆ అమ్మాయి ఎవరు అంటూ గొంతు పట్టేశాడు. తమన్ మాట్లాడుతూ.. ‘రేయ్ నువ్వు కూడా స్మెల్ కూడా పట్టేస్తున్నావా? ? ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. పెళ్లి చేసుకుంటావా అని థమన్ ప్రశ్నించగా? ఎవరు అని సాయి ధరమ్ తేజ్ అడిగాడు. అంతలోనే శ్రీముఖి ఫోన్ తీసుకొని ‘హాయ్ అండి.. మీరంటే నాకు చాలా ఇష్టం.. ముఖ్యంగా మీ కండలంటే మరింత ఇష్టం అంటూ చెప్పేసింది. దీనికి సాయిధరమ్ తేజ్ ఇచ్చిన రిప్లై మాత్రం నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. శ్రీముఖి ప్రపోజల్ కు వెంటనే స్పందించిన మెగా మేనల్లుడు.. ‘నా కండల కంటే మావోడి కండలు ఇంకా బాగుంటాయి’ అని రిప్లై ఇచ్చాడు. సాయి ధరమ్ తేజ్ సమాధానానికి శ్రీముఖి ముఖం వాడిపోయింది. వెంటనే బుంగమూతి పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us