AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopichand: తండ్రిలా పెద్ద డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు.. కానీ 19 ఏళ్లకే.. గోపీచంద్ సోదరుడు ఎలా చనిపోయాడో తెలుసా?

దిగ్గజ దర్శకుడు టి. కృష్ణ వర్ధంతిని పురస్కరించుకుని ఇటీవల పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. అలాగే టి. కృష్ణ తనయుడు హీరో గోపీచంద్ కూడా ఆయనను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. కాగా టి. కృష్ణ లాగే ఆయన పెద్ద కుమారుడు కూడా పెద్ద డైరెక్టర్ కావాలని కలలు కన్నాడు.. కానీ..

Gopichand: తండ్రిలా పెద్ద డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు.. కానీ 19 ఏళ్లకే.. గోపీచంద్ సోదరుడు ఎలా చనిపోయాడో తెలుసా?
Gopichand
Basha Shek
|

Updated on: Oct 23, 2026 | 9:21 PM

Share

దిగ్గజ దర్శకుడు టి. కృష్ణ గురించి నేటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ.. 1980-90’s జనరేషన్ కు ఈ డైరెక్టర్ అన్నా, ఈయన సినిమాలన్నా బాగా ఇష్టపడతారు. ఓవరాల్ గా తన కెరీర్ లో ఏడు సినిమాలే తీసినా అన్నీ సామాజిక సృహ కలిగిన అద్భుత చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం, వందేమాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం.. ఇలా టి.కృష్ణ తీసిన సినిమా ఒక్కో ఆణిముత్యమని చెప్పవచ్చు. కాగా ఈ డైరెక్టర్ తీవ్ర అనారోగ్యంతో కేవలం 36 ఏళ్లకే ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. టి.కృష్ణ చనిపోయినప్పుడు ఆయన తనయుడు, హీరో గోపీచంద్ వయసు కేవలం 8 ఏళ్లు మాత్రమేనట. కాగా తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ గోపీచంద్ కూడా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. . ‘తొలివలపు’ చిత్రంతో హీరోగా పరిచయమైన గోపీచంద్, ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ వంటి చిత్రాలలో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ‘యజ్ఞం’, ‘రణం’, ‘లక్ష్యం’, ‘లౌక్యం’, ‘సాహసం’ ‘జిల్’, ‘గౌతమ్ నంద’, ‘సీటీమార్’, ‘భీమా’, ‘విశ్వం’ తదితర సూపర్ హిట్ సినిమాల్లో కథానాయకుడిగా నటించి టాలీవుడ్‌లో ‘ మాచో స్టార్‌ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గోపీచంద్ కంటే ముందే ఆయన సోదరుడు ప్రేమ చంద్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తండ్రి బాటలోనే దర్శకుడు కావాలని కలలు కన్నాడు.

కాగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మాయి కాపురం’ అనే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి ఇండస్ట్రీ మెలకువలు నేర్చుకున్నాడు ప్రేమ్ చంద్. ఆ తర్వాత తనే స్వయంగా మెగా ఫోన్ పట్టుకుని మొదటి సినిమా కూడా స్టార్ట్ చేశాడు. కానీ విధ ఆయన ఆశలను రోడ్డు ప్రమాదం రూపంలో ఛిన్నాభిన్నం చేసింది. గోపీచంద్ అన్నయ్య ప్రేమ్ చంద్ మరణం గురించి ప్రముఖ నటుడు మాదాల రవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ అమ్మాయి కాపురం సినిమా షూటింగ్ కోసం ఒక సోడా బండి సమయానికి సెట్ కు రాలేదు. అది టంగుటూరు పక్క నుంచి రావాలి. అప్పుడు ప్రేమ్ చంద్ నేను తీసుకొస్తానని వెళ్లాడు. డ్రైవర్ స్లోగా వెళుతుండడంతో తాను డ్రైవింగ్ చేస్తానని స్టీరింగ్ తీసుకున్నాడు. ప్రేమ్ చంద్ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న నిమిషానికే లారీ వచ్చి కారును ఢీ కొట్టింది. దీంతో స్పాట్ లోనే ప్రేమ్ చంద్ చనిపోయాడు’ అని మాదాల రవి ఎమోషనల్ అయ్యాడు.

కాగా ఈ దుర్ఘటన సమయంలో గోపీచంద్ రష్యాలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. వీసా సమస్య వల్ల కనీసం అన్నయ్య అంత్యక్రియలకు కూడా రాలేకపోయాడు. ఇలా తండ్రి, సోదరుల మరణాలతో చాలా కృంగిపోయాడు గోపీచంద్. అయితే కుటుంబం బాధ్యత తనమీదే ఉండడంతో ఎలాగోలా ఈ విషాదాల నుంచి బయటపడ్డాడు. హీరోగా నిలదొక్కుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us