AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 ఏడో వారం ఓటింగ్ రిజల్ట్.. ఇక ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ బ్యాగ్ సర్దుకోవాల్సిందే..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో మరో ఎలిమినేషన్ కు రంగం సిద్ధమైంది. ఏడో వారం నామినేషన్స్ కు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ దాదాపు ముగిసింది. ఎప్పటిలాగే రోహిత్ టాప ప్లేస్ లో ఉండగా ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 ఏడో వారం ఓటింగ్ రిజల్ట్.. ఇక ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ బ్యాగ్ సర్దుకోవాల్సిందే..
Bigg Boss Telugu 10 (2)
Basha Shek
|

Updated on: Oct 23, 2026 | 8:03 PM

Share

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ ఆసక్తికరంగానూ, రసవత్తరంగానూ సాగుతోంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఏడో వారం కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. మొదటి వారంలో ఛైత్ర, చరణ్ ఎలిమినేట్ అయ్యారు. అయితే చరణ్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. రెండో వారంలో కృష్ణుడు ఎలిమినేట్ అయ్యాడు. ఇక మూడో వారంలో ఎలిమినేషన్ లేకపోయినా వైల్డ్ కార్డు ద్వారా అదే వారం హౌస్ లోకి అడుగుపెట్టిన మిథిలేష్ రెడ్డి బిగ్ బాస్ ఇచ్చిన రూ. 15 లక్షల క్యాష్ ప్రైజ్ తీసుకొని బయటకు వెళ్లిపోయాడు. ఇక నాలుగవ వారం సృష్టి ఎలిమినేట్ కాగా, ఐదవ వారం చరణ్, అపూర్వ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు. ఇక ఆరోవారం కూడా ఎలిమినేషన్ జరగలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రోహిత్‌, త్రిగుణ్‌, అమన్‌, రామకృష్ణ, టెంపర్‌ వంశీ, సింగర్‌ ఝాన్సీ, వర్షిణి, సుధీర్‌, శివ, దక్షి, నీతూ మాస్టర్‌, స్వేతా నాయుడు, రామ్‌ ప్రసాద్‌, నరేష్‌, ముఖేష్‌ గౌడ, దేబ్జానీ, షాలిని.. ఇలా మొత్తం 17 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. కాగా బిగ్ బాస్ సీజన్ ప్రారంభమై దాదాపు 40 రోజులు పూర్తయ్యాయి. మరో తొమ్మిది వారాల పాటు ఈ షో ఉండనుంది. టాప్‌ 5కి ఐదుగురు మాత్రమే వెళ్తారు. ఈ లెక్కన 9 వారాల్లో 12 మంది హౌస్ నుంచి ఎలిమినేట్‌ కావాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది.

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఏడో వారం రోహిత్‌, త్రిగుణ్‌, రామకృష్ణ, అమన్‌, స్వేతా నాయుడు, వర్షిణి, టెంపర్‌ వంశీ, సుధీర్‌, ఝాన్సీ, శివ, దక్షి, నీతూ మాస్టర్‌ నామినేషన్‌లో ఉన్నారు. ఒక ఆడియెన్స్ ఓటింగ్ కూడా ఇవాళ్టి (శుక్రవారం) రాత్రి తో ముగియనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఓటింగ్‌ రిజల్ట్ ఇలా ఉంది. ఎప్పటిలాగానే ఓటింగ్ లో రోహిత్‌ టాప్‌లో దూసుకెళ్లిపోతున్నాడు. ఆ తర్వాత త్రిగుణ్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో ప్లేస్ లో రామకృష్ణ ఉండడం గమనార్హం. ఆ తర్వాత నాలుగో ప్లేస్ లో అమన్, ఐదో స్థానంలో సింగర్ ఝాన్సీ, ఆరో పోజిషన్ లో యాంకరర్ వర్షిణీ, ఏడో ప్లేస్ లో సుధీర్, ఎనిమిదో స్థానంలో టెంపర్ వంశీ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో శ్వేతా నాయుడు, నీతూ నటరాజ్, దక్షి, శివకుమార్ ఉన్నారు. వీరిలో ఇద్దరు ఎలిమినేట్ కావొచ్చని తెలుస్తోంది. అయితే నీతూ మాస్టర్ ఈ వారం టాస్క్ లు బాగానే ఆడింది. అలాగే శివ్ కూడా చాలా ఎగ్రెసివ్ గా టాస్కులు ఆడుతున్నాడు. కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ కాస్త ఇంట్రెస్ట్ గానే ఉండే అవకాశం ఉంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లేటెస్ట్ ప్రోమో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us