AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jailer 2: ఎట్టకేలకు కోలీవుడ్ కల నెరవేర్చనున్న రజనీకాంత్.. ఆల్‌టైమ్ రికార్డ్ వసూళ్ల దిశగా ‘జైలర్ 2’

ఇప్పటికే అనేక బాలీవుడ్, తెలుగు సినిమాలు ఈజీగా 1000 కోట్లు వసూలు చేశాయి. చివరకు కన్నడ సినిమాలైన కేజీఎఫ్, కాంతార సినిమాలు కూడా 1000 కోట్ల మార్కును దాటాయి. కానీ రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య వంటి స్టార్ నటులు ఉన్న తమిళ చిత్ర పరిశ్రమ మాత్రమే ఈ ఘనతను సాధించలేకపోయింది. అయితే, 'జైలర్ 2' ఇప్పుడు 1000 కోట్లు వసూళ్ల దిశగా అడుగులు వేస్తోంది.

Jailer 2: ఎట్టకేలకు కోలీవుడ్ కల నెరవేర్చనున్న రజనీకాంత్.. ఆల్‌టైమ్ రికార్డ్ వసూళ్ల దిశగా 'జైలర్ 2'
Jailer 2 Movie
Basha Shek
|

Updated on: Oct 23, 2026 | 10:23 PM

Share

భారీ బడ్జెట్ సినిమాలు వెయ్యి కోట్ల మార్కును చేరుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. పెద్ద స్టార్ నటుల కొన్ని యావరేజ్ సినిమాలు కూడా కేవలం నెల రోజుల్లోనే వెయ్యి కోట్లు వసూలు చేశాయి. అనేక బాలీవుడ్, తెలుగు సినిమాలు ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాయి. కేజీఎఫ్, కంతర వంటి కన్నడ చిత్రాలు కూడా వెయ్యి కోట్ల మార్కును దాటాయి. కానీ రజనీకాంత్ , కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య వంటి స్టార్ నటులు ఉన్న తమిళ చిత్ర పరిశ్రమ మాత్రమే ఈ ఘనతను సాధించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లు దాటిన ఒక్క తమిళ సినిమా కూడా లేదు. భారతదేశంలోని అతిపెద్ద చిత్ర పరిశ్రమలలో ఒకటి అయినప్పటికీ, ఆ ఇండస్ట్రీ నుంచి ఒక్క సినిమా కూడా 1000 కోట్లు సంపాదించలేకపోయింది. వెయ్యి కోట్లు సంపాదించే సినిమాను ఇవ్వాలన్నది తమిళ చిత్ర నటులు, దర్శకుల కల. ఇప్పుడు ఆ కలను నెరవేర్చే బాధ్యత సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’పై ఉంది. ‘జైలర్ 2’ విడుదలై వారం రోజులు కాగా, ఇప్పటివరకు సుమారు రూ. 600 కోట్లకు పైగానే వసూలు చేసింది. తద్వారా ఒక వారంలో ఇంత భారీ మొత్తాన్ని వసూలు చేసిన మొదటి తమిళ చిత్రంగా రికార్డుల కెక్కింది. ఈ చిత్రం ఓటీటీకి రాకముందే, అంటే రాబోయే రెండు మూడు వారాల్లో మిగిలిన నాలుగు వందల కోట్లను సంపాదించే బలమైన అవకాశం ఉందని బాక్సాఫీస్ పండితులు విశ్లేషించారు. దీంతో, ‘జైలర్ 2’ 1000 కోట్లు వసూలు చేసిన తొలి తమిళ చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.

2023లో రిలీజైన జైలర్ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 తెరకెక్కింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹600–650 కోట్లు వసూలు చేసింది. దీని కారణంగా, రెండవ భాగంపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అందుకు తగ్గట్టుగానే ఈ క్రేజీ సీక్వెల్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం బడ్జెట్ సుమారు రూ. 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఎప్పటిలాగే రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ యాక్షన్, స్టైల్, స్వాగ్ అభిమానులకు తెగ నచ్చేశాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణ, విద్యాబాలన్ మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు, యోగిబాబు, మిర్నా మేనన్‌, రిత్విక్‌.. ఇలా ఎంతో మంది తారలు వివిధ పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
'జైలర్ 2' రికార్డు కలెక్షన్లు.. ఎట్టకేలకు నెరవేరనున్న కోలీవుడ్ కల
'జైలర్ 2' రికార్డు కలెక్షన్లు.. ఎట్టకేలకు నెరవేరనున్న కోలీవుడ్ కల
క్రెడిట్ కార్డు ఉపయోగించడం లేదా..? మీకే నష్టం.. ఎలా అంటే..?
క్రెడిట్ కార్డు ఉపయోగించడం లేదా..? మీకే నష్టం.. ఎలా అంటే..?
కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
వెంకీ, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం 'ట్రైలర్ వచ్చేసింది
వెంకీ, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం 'ట్రైలర్ వచ్చేసింది
రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే
రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే
ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతున్నాయా? ఈ మసాలా స్నాక్ చేస్తే అదుర్స్
ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతున్నాయా? ఈ మసాలా స్నాక్ చేస్తే అదుర్స్
ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్.. ఎవరంటే?
ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్.. ఎవరంటే?
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇక నుంచి అవన్నీ ఫ్రీ..
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇక నుంచి అవన్నీ ఫ్రీ..
Video: లైవ్‌ రిపోర్టింగ్ చేస్తుండగా దూసుకొచ్చిన అల!
Video: లైవ్‌ రిపోర్టింగ్ చేస్తుండగా దూసుకొచ్చిన అల!
రాగుల్లో కాల్షియం.. సజ్జల్లో ఇనుము.. మరి రోజూ ఏ రొట్టె తినాలి?
రాగుల్లో కాల్షియం.. సజ్జల్లో ఇనుము.. మరి రోజూ ఏ రొట్టె తినాలి?