AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adah Sharma: ‘బ్లాక్ మిల్క్’.. హీరోయిన్ అదాశర్మ అందానికి కారణమిదే.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..వీడియో

ప్రస్తుతం తెలుగులో నటించకపోయినా హిందీలో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంటోంది అదా శర్మ. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ హార్ట్ ఎటాక్ హీరోయిన్ తాజాగా తన బ్యూటీ సీక్రెట్ ను బయటపెట్టింది.

Adah Sharma: 'బ్లాక్ మిల్క్'.. హీరోయిన్ అదాశర్మ అందానికి కారణమిదే.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..వీడియో
Actress Adah Sharma
Basha Shek
|

Updated on: Oct 29, 2026 | 9:43 PM

Share

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది హార్ట్ ఎటాక్ హీరోయిన్ అదా శర్మ. బ్యూటీ, హెల్త్, లైఫ్ స్టైల్, ఫిట్ నెస్.. ఇలా పలు అంశాలకు సంబంధించిన చిట్కాలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన బ్యూటీ సీక్రెట్ ను రివీల్ చేసింది. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను పంచుకుంది. ఇందులో తన మెరిసే చర్మం కోసం రోజూ ‘బ్లాక్‌ మిల్క్‌’ తాగుతున్నట్లు చెప్పుకొచ్చింది అదా శర్మ. అంతేకాదు ఇంట్లోనే సింపుల్ గా ఈ బ్లాక్ మిల్క్ ను తయారు చేసుకునే విధానాన్ని అలాగే దీని వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలను కూడా అభిమానులతో పంచుకుంది. అదాశర్మ షేర్ చెప్పిన దాని ప్రకారం.. ముందుగా ఓ చిన్న పాత్రలో నల్ల నువ్వుల్ని తీసుకొని దోరగా వేయించాలి. ఆ తర్వాత సుమారు పది జీడిపప్పుల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటినీ మిక్సీ జార్‌లోకి తీసుకొని.. నాలుగైదు గింజలు తొలగించిన డేట్స్‌, చిటికెడు ఉప్పు వేసి.. మెల్లగా నీళ్లు పోస్తూ స్మూతీలా తయారుచేసుకోవాలి. ఆపై దీన్ని వడకట్టుకొని తాగాలి. ఇక ఇందులో మిగిలిన పిప్పిని కూడా చర్మ సౌందర్యానికి ఉపయోగించుకోవచ్చు. దీనిని ముఖానికి పూసుకొని కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచుకొని.. ఆపై శుభ్రమైన నీటితో కడిగేసుకోవాలి.

కాగా రోజూ ఈ బ్లాక్‌ మిల్క్‌ తాగడం వల్ల పలు ప్రయోజనాలు కలుగుతాయంటోంది అదాశర్మ. ముఖ్యంగా చర్మం మృదువుగా మారడంతో పాటు నిగారింపును సంతరించకుంటుందని చెబుతోంది. ఇక నల్ల నువ్వుల్లో సహజంగానే పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో పుష్కలంగా ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం తదితర పోషకాలు ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పడుతాయి. అలాగే జీడిపప్పులో ఉండే కాపర్‌, మెగ్నీషియం; డేట్స్‌లోని సహజ చక్కెరలు, పీచు, ఖనిజాలు.. బాడీకి రోజంతటికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

బ్లాక్ మిల్క్ మేకింగ్ వీడియో..

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: అదా శర్మ చెప్పిన దాని ప్రకారం ఈ నువ్వుల పాలు ఆరోగ్యానికి మంచిదే అయినా చాలా మందికి నువ్వులు అలాగే జీడిపప్పు పడకపోవచ్చు. వీటిని తీసుకుంటే అలర్జీలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అలాంటి వారు ఈ హెల్దీ డ్రింక్ కు దూరంగా ఉండడమే మేలు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us