AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana Movie: ‘రామాయణ’ సినిమా.. సీతారాముల కల్యాణం సాంగ్ వచ్చేసింది.. సాయి పల్లవిని చూస్తూ ఉండిపోతారంతే!

యావత్ భారతీయ సినిమా ప్రేక్షకులు అత్యం ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమా 'రామాయణ'. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా మైథలాజికల్ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి సీతారాముల కల్యాణం సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్

Ramayana Movie: 'రామాయణ' సినిమా.. సీతారాముల కల్యాణం సాంగ్ వచ్చేసింది.. సాయి పల్లవిని చూస్తూ ఉండిపోతారంతే!
Ramayana Movie
Basha Shek
|

Updated on: Oct 29, 2026 | 8:08 PM

Share

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్, సౌతిండియన్ న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతారాములుగా నటిస్తోన్న సినిమా రామాయణ. దంగల్ ఫేమ్ నితీశ్ తివారీ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియన్ మైథలాజికల్ మూవీలో కన్నడ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీ బిజీగా ఉన్నారు మేకర్స్. రణ్ బీర్ కపూర్, సాయి పల్లవితో పాటు చిత్ర బృందమంతా దేశ విదేశాల్లో పర్యటిస్తూ రామాయణం సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల లాస్ ఏంజెలిస్, కాలిఫోర్నియాలో ప్రీమియర్ షోలు సైతం ప్రదర్శించగా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. కాగా రామాయణ నుంచి ఇప్పటికే రెండు, మూడు పాటలతో సహా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ ను విడుదల చేశారు. ‘జత గూడే’ అంటూ సాగే ఈ పాట సీతారాముల కల్యాణం నేపథ్యంలో సాగుతుంది. ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా.. శిరీష భాగవతుల ఆలపించారు. ఏఆర్ రెహమాన్ ఈ సాంగ్ ను కంపోజ్ చేశారు. కొన్ని నిమిషాల క్రితమే రిలీజైన ఈ సాంగ్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.

రామయాణ సినిమా విషయానికి వస్తే.. నమిత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్’, యష్‌కు చెందిన ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’, ‘డిఎన్‌ఇజి’ సంస్థలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించాయి. సన్నీ డియోల్, శోభన, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, హరీశ్‌ ఉత్తమన్‌, ఫైసల్‌ మాలిక్‌, వివేక్‌ ఒబెరాయ్‌, కునాల్‌ కపూర్‌, ముకేశ్‌ తివారి, అనుపమ్ ఖేర్, సౌరబ్‌ సచ్‌దేవ్‌, రవి దూబే, ఆదినాథ్‌ కొఠారే, నితీశ్‌ శర్మ.. ఇలా ఎంతో మంది స్టార్స్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఇక ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఈ చిత్ర ప్రత్యేక ప్రీమియర్ జరిగింది. అమెరికన్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతగానో ప్రశంసించారు. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’తో పోలుస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ భాషలలో విడుదలవుతుండగా, ఫ్రెంచ్, చైనీస్, జపనీస్, జర్మన్ వంటి మరికొన్ని విదేశీ భాషలలోకి కూడా డబ్ కానుంది. అందువల్ల, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

సాంగ్ ఇదిగో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రణ్ బీర్, సాయి పల్లవిల 'రామాయణ' .. సీతారాముల కల్యాణం పాట చూశారా?
రణ్ బీర్, సాయి పల్లవిల 'రామాయణ' .. సీతారాముల కల్యాణం పాట చూశారా?
 వామ్మో.. డాక్టర్ల కన్నా మూడేళ్ల ముందే క్యాన్సర్‌ కు AI చెక్!
 వామ్మో.. డాక్టర్ల కన్నా మూడేళ్ల ముందే క్యాన్సర్‌ కు AI చెక్!
 పిల్లలు చదువంటే పారిపోతున్నారా? పేరెంట్స్ ఈ 3 పనులు చేయండి!
 పిల్లలు చదువంటే పారిపోతున్నారా? పేరెంట్స్ ఈ 3 పనులు చేయండి!
టాప్ 10 ‘బ్లైండ్ ర్యాంకింగ్’లో కోహ్లీ ప్లేస్ చూస్తే షాకే..?
టాప్ 10 ‘బ్లైండ్ ర్యాంకింగ్’లో కోహ్లీ ప్లేస్ చూస్తే షాకే..?
Video: చనిపోతాడని వదిలేశారు.. ప్రాణాలకు తెగించి కాపాడిన టెకీ!
Video: చనిపోతాడని వదిలేశారు.. ప్రాణాలకు తెగించి కాపాడిన టెకీ!
పాకిస్థాన్‌లో‌ని ఈ కట్టడాన్ని తాజ్ మహల్‌తో ఎందుకు పోలుస్తారు? 
పాకిస్థాన్‌లో‌ని ఈ కట్టడాన్ని తాజ్ మహల్‌తో ఎందుకు పోలుస్తారు? 
నల్లా నుంచి చుక్కచుక్కగా నీరు కారుతోందా? నెలకు ఇంత నీరు వృథా!
నల్లా నుంచి చుక్కచుక్కగా నీరు కారుతోందా? నెలకు ఇంత నీరు వృథా!
3 మ్యాచ్‌లకే తేలిపోయిన భువీ.. కట్‌చేస్తే.. ఊహించని షాక్
3 మ్యాచ్‌లకే తేలిపోయిన భువీ.. కట్‌చేస్తే.. ఊహించని షాక్
బిగ్‌బాస్ 10లో ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరూ బయటికే
బిగ్‌బాస్ 10లో ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరూ బయటికే
నీటిలో పుట్టి.. నీటిలో పెరిగి.. నీళ్లు తగిలితే చనిపోయేది ఏది..?
నీటిలో పుట్టి.. నీటిలో పెరిగి.. నీళ్లు తగిలితే చనిపోయేది ఏది..?