AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Royyala Pulao: గుమగుమలాడే స్పైసీ రొయ్యల పులావ్.. ఒక్కసారి తిన్నారంటే వదలరు

ఆదివారం లేదా పండుగ రోజుల్లో నాన్‌వెజ్ ప్రియులకు బిర్యానీ, పులావ్‌లు ఉంటే భోజనం పరిపూర్ణమవుతుంది. అందులోనూ రొయ్యలతో (Prawns) చేసే పులావ్ రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే చాలామంది ఇంట్లో రొయ్యల పులావ్ చేసినప్పుడు రొయ్య ముక్క గట్టిపడిపోతోందని, లేదా రొయ్యల్లోని ఫ్లేవర్ అన్నానికి పూర్తిగా పట్టడం లేదని అనుకుంటుంటారు. ఈ చిన్న చిన్న మెళకువలు మరియు ప్రత్యేకమైన తాజా సుగంధ మసాలా పొడితో చేస్తే.. రెస్టారెంట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ రుచితో, ఘుమఘుమలాడే రొయ్యల పులావ్ సిద్ధమవుతుంది.

Phani CH
|

Updated on: Oct 30, 2026 | 8:44 PM

Share
కావలసిన పదార్థాలు: అర కేజీ రొయ్యలు, 20 నిమిషాలు నానబెట్టిన 2 గ్లాసులు బియ్యం,  3½ గ్లాసుల నీళ్లు, సన్నగా తరిగిన  2 చిన్న ఉల్లిపాయలు, 1 మీడియం  సైజు సన్నగా తరిగిన టమాటా, 10 నుండి 12 జీడిపప్పు పలుకులు, బిర్యానీ ఆకులు – 2, షాజీరా – అర టీస్పూన్, పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్, తాజా పుదీనా, కొత్తిమీర తరుగు – కొద్దిగా, 2 టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి , వంట నూనె సుగంధ పులావ్ మసాలా పొడి కోసం: 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ షాజీరా, అర టీస్పూన్ సోంపు, యాలకులు – 3,  5 నుండి 6 లవంగాలు, చిన్న ముక్క దాల్చినచెక్క, 1 టీస్పూన్ రాతిపువ్వు తాజా గ్రీన్ మసాలా పేస్ట్ కోసం: 15 నుండి 20 వెల్లుల్లి రెబ్బలు, 1½ అంగుళాల ముక్క తాజా అల్లం,  5 నుండి 6 పచ్చిమిరపకాయలు, చిన్న కట్ట తాజా కొత్తిమీర

1 / 5
తయారీ విధానం:  శుభ్రం చేసిన అరకేజీ రొయ్యల్లో అర టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం వేసి బాగా కలిపి 10 నిమిషాలు పక్కన ఉంచాలి. స్టవ్‌పై పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి రొయ్యలను వేయాలి. రొయ్యల్లోంచి నీరు ఊరి.. ఆ నీరంతా పూర్తిగా ఇంకిపోయి నూనె తేలే వరకు 3-4 నిమిషాలు వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.

2 / 5
మిక్సీ జార్‌లో ధనియాలు, జీలకర్ర, షాజీరా, సోంపు, యాలకులు, బడి ఇలాచీ, లవంగాలు, దాల్చినచెక్క, రాతిపువ్వు వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే జార్‌లో వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి మరియు కొత్తిమీరను కాడలతో సహా వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి గ్రీన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. పులావ్ చేసే వెడల్పాటి పాత్రలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేడిచేయాలి. ఇందులో బిర్యానీ ఆకులు, అర టీస్పూన్ షాజీరా, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు సగం వేగాక జీడిపప్పు పలుకులు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాలి.

3 / 5
ఇప్పుడు గ్రైండ్ చేసిన అల్లం-వెల్లుల్లి-కొత్తిమీర పేస్ట్, తరిగిన టమాటా ముక్కలు వేసి నూనె తేలే వరకు మగ్గించాలి. ఆ తర్వాత వేయించి ఉంచుకున్న రొయ్యలు, పావు టీస్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ కారం మరియు తయారుచేసిన సుగంధ మసాలా పొడిని వేయాలి. మసాలా మాడకుండా 2 స్పూన్ల నీళ్లు పోసి మూతపెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్‌పై మగ్గించాలి.

4 / 5
నానబెట్టిన బియ్యంలోని నీటిని పూర్తిగా వంపేసి.. బియ్యాన్ని మాత్రమే మసాలాలో వేసి నెమ్మదిగా 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యానికి 3½ గ్లాసుల నీళ్లు పోయాలి (బాస్మతి అయితే 3 గ్లాసులు). ఇందులో రైస్‌కి సరిపడా ఉప్పు, తాజా కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి ఉప్పు సరిచూసుకోవాలి.మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి మూతపెట్టి ఎసరు మరిగించాలి. నీరంతా ఇంకి అన్నం దగ్గరపడ్డాక.. మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌కి తగ్గించి మూతపెట్టి 5 నుండి 6 నిమిషాలు దమ్ చేయాలి. గరిటెతో చెక్ చేస్తే తడి లేకుండా పొడిగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, నోరూరించే రెస్టారెంట్ స్థాయి 'రొయ్యల పులావ్' సిద్ధం! పక్కన ఎలాంటి సైడ్ డిష్ లేకపోయినా వేడివేడిగా తింటుంటే కమ్మగా లోపలికి దిగిపోతుంది; పిల్లలకు కొద్దిగా ఉల్లిపాయ పెరుగు రైతాతో సర్వ్ చేస్తే అమితమైన ఇష్టంతో ఆరగిస్తారు!

5 / 5
Follow Us
గుమగుమలాడే స్పైసీ రొయ్యల పులావ్.. ఒక్కసారి తిన్నారంటే వదలరు

ఇంట్లో Wi-Fiకి పాస్‌వర్డ్ లేకుండానే కనెక్ట్ కావ్వొచ్చు

పశువుల కోసం వచ్చి సడెన్‌గా ఇంట్లో దూరిన సింహం.. మహిళ ఏం చేసిదంటే

రూ.10 లక్షల లోపు కారు కొనాలనుకుంటున్నారా?

మీ కారు మైలేజీని పెంచుకోవాలనుకుంటున్నారా? ఎవ్వరు చెప్పని ట్రిక్స్

ఇప్పటివరకు ఆ స్టార్ హీరోతో కలిసి నటించని రాజీవ్ కనకాల..

సన్‌ఫ్లవర్ ఆయిల్ vs రైస్ బ్రాన్ ఆయిల్.. ఆరోగ్యానికి ఏది మంచిది..?

కేదార్‌నాథ్ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు.. ఫత్వా జారీ

రోడ్డుపై దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన విద్యార్థి

పండగ వేళ బంపర్‌ ఆఫర్‌.. ఈ కారు ధర ఏకంగా రూ.34 లక్షల వరకు తగ్గింది