రోజూ ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బ తింటే ఏమవుతుంది?

20 November 2026

TV9 Telugu

TV9 Telugu

వెల్లుల్లి ఒక రకం మ్యాజికల్‌ ఫుడ్‌ ఐటమ్‌..! దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్‌ లక్షణాలు ఉండటంవల్ల వంటల్లో ఒక భాగమైపోయింది

TV9 Telugu

దీనిలో అల్లిసిన్‌ అనే పదార్థంతోపాటు ఫాస్ఫరస్, జింక్‌, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

వెల్లుల్లిలో విటమిన్‌ సి, కె, ఫోలేట్‌, నియాసిన్‌, థయామిన్‌ కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి

TV9 Telugu

ఈ భూమ్మీద ఇతర వ్యాధులతో పోల్చుకుంటే గుండె నొప్పి, గుండెపోటుతోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి

TV9 Telugu

అధిక రక్తపోటు అనేది ఈ తరహా అనారోగ్యాలకు ప్రధాన కారణం. వెల్లుల్లిని డెయిలీ డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు

TV9 Telugu

పచ్చి వెల్లుల్లిని మీ డైలీ డైట్‌లో భాగం చేయడం ద్వారా జీర్ణ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు

TV9 Telugu

దీనికి వాపును తగ్గించే లక్షణం ఉన్నది. పేగుల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడంవల్ల పేగుల్లోని నులి పురుగులు తొలగిపోతాయి

TV9 Telugu

కడుపులోని ప్రమాదకరమైన బ్యాక్టీరియాను కూడా వెల్లుల్లి తొలగిస్తుంది. మొత్తానికి ఉదరం ఆరోగ్యానికి పచ్చి వెల్లుల్లి తోడ్పడుతుంది