రాజమండ్రి కల్తీపాల ఘటనలో బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. శుక్రవారం వరకు డయాలసిస్ పొందిన పేషెంట్లకు ఇప్పుడు వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నారు. మూడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 11 మంది వెంటిలేటర్‌పై డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇప్పటివరకు ఐదుగురు మరణించారు, 15 మందికి డయాలసిస్‌తో పాటు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది.