AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OG Movie Trailer: వేట‌కు సిద్ధ‌మైన‌ బెంగాల్ టైగ‌ర్.. ఓజీ ట్రైలర్ పై మెగా మేనల్లుడు రివ్యూ..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న సినిమా ఓజీ. చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకొంటోన్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా విజయ దశమి కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి.

OG Movie Trailer: వేట‌కు సిద్ధ‌మైన‌ బెంగాల్ టైగ‌ర్.. ఓజీ ట్రైలర్ పై మెగా మేనల్లుడు రివ్యూ..
Sai Durga Tej, Og
Rajeev Rayala
|

Updated on: Sep 22, 2025 | 6:27 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎఫ్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ట్రైలర్ మాత్రం ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇక ఈ ట్రైలర్‌ను వీక్షించిన సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు ఆయన వేసిన పోస్ట్ అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది. ‘మేం ఇన్నాళ్లుగా మిస్ అవుతున్న బెంగాల్ టైగర్ ఇప్పుడు వేటకు బయల్దేరింది..నాతో సహా ప్రతీ అభిమాని కోరిక తీర్చిన, అందరినీ సంతృప్తి పరిచిన సుజీత్ గారికి థాంక్స్.. ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు.. నా ప్రియ మిత్రుడు తమన్ ఇచ్చిన బీజీఎం అయితే నిజంగానే ఫైర్ స్ట్రామ్..అని పొగడ్తలతో ముంచెత్తారు సాయి దుర్గ తేజ్.

చేసింది ఒకే ఒక్క సినిమా.. అందాలతో గత్తరలేపింది.. దెబ్బకు కనించకుండాపోయింది

నా హీరో, నా గురువు పవన్ కళ్యాణ్ మామయ్య ప్రతీ ఫ్రేమ్‌లో అద్భుతంగా కనిపించారు.. స్వాగ్, స్టైల్ ఇవన్నీ కూడా ఆయనకు తప్పా ఇంకెవ్వరికీ సాధ్యం కావు అన్నట్టుగా ఉంది.. ఓజీని మనమంతా కలిసి సెలెబ్రేట్ చేసుకోవాల్సిందే’ అని ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇదేందయ్యా..! అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!! మరీ ఇంత అందంగా ఎలా మారిపోయింది ఈ అమ్మడు

ఓజీ ట్రైలర్‌ అయితే.. సుజిత్ చేసిన కట్స్, పవన్ కళ్యాణ్‌ స్టైలీష్‌, స్వాగ్‌‌ను మరో యాంగిల్‌లో చూపించడం, ఇక తమన్ బీజీఎం, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ఇలా ప్రతీ ఒక్క విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 24న పెయిడ్ ప్రీమియర్లకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. సుజీత్ విజన్, థమన్ సంగీతం, పవన్ కళ్యాణ్ తిరుగులేని శక్తితో ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద ఒక పండుగ వాతావరణాన్ని తీసుకు వచ్చేలా ఉంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుండగా.. ఇమ్రాన్ ఆష్మి విలన్ గా కనిపించనున్నారు. శ్రీయా రెడ్డి కీలక పాత్రలో ఆకట్టుకోనున్నారు. సెప్టెంబర్ 25న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకానుంది.

ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు

సాయి దుర్గ తేజ్ ట్విట్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.