జగిత్యాల జిల్లా వెంపేటలో బర్రెను కుక్క కరిచిందనే అనుమానంతో రేబిస్ భయం వ్యాపించింది. ఆ బర్రె పాలు తాగిన వారందరికీ వ్యాధి వస్తుందనే వదంతులతో గ్రామస్తులు టీకాల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరుగులు తీశారు. డాక్టర్లు టీకా అవసరం లేదని చెప్పినా, ప్రజలు భయంతో లైన్లలో నిలిచారు.