AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (మార్చి 1-7, 2026): మేష రాశి వారికి ఈ వారమంతా చాలావరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. రాశ్యధిపతి కుజుడు లాభ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం వంటివి జరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 28, 2026 | 5:39 PM

Share
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వారమంతా చాలావరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. రాశ్యధిపతి కుజుడు లాభ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. అయితే, విలాసాల మీద ఖర్చు పెరిగే అవకాశం ఉంది. శుక్రుడు వ్యయ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల జీవిత భాగస్వామికి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గురు, రవుల బలం కూడా అధికంగా ఉన్నందువల్ల ముఖ్యమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం, వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉండడం, ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడితో యుతి చెందడం, ధనస్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం సునాయాసంగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విశేషంగా లాభిస్తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. శత్రు, రోగ, రుణ బాధలు అదుపులో ఉంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని దాటుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా అనుకూల ఫలితాలనిస్తాయి.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడు భాగ్య స్థానంలో రవితో కలిసి ఉన్నందువల్ల వారమంతా సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పాలకుల నుంచి గుర్తింపు లభిస్తుంది. దశమంలో శుక్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం వంటివి జరుగుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సజావుగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మిత్రుల వివాదాల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): గ్రహ బలం కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. క్షణం కూడా తీరిక లేకుండా గడిచి పోతుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను, కొన్ని అవసర పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో సహచరుల నుంచి సహకారం ఉంటుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. కుటుంబపరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): లాభ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో రవి, బుధ, కుజుల సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. ప్రభుత్వపరంగా జరగాల్సిన పనులు జరిగిపోతాయి. తండ్రి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరిగే సూచనలున్నాయి. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. అష్టమ శని కారణంగా ఇంటా బయటా పని ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగం చెందే సూచనలున్నాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం, దశమంలో గురువు సంచారం వంటి కారణాల వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ఫలితం పొందుతారు. ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించడంలో సహోద్యోగుల సహాయం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి ఉచ్ఛలో, గురువు భాగ్య స్థానంలో, బుధాదిత్య యోగం పంచమంలో సంచారం చేయడం వల్ల ఈ వారమంతా వైభవంగా సాగిపోతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. కొన్ని వ్యక్తిగత పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొన్ని అత్యవసర వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు బాగా అనుకూలంగా ఉండడంతో పాటు, రవి, శుక్రులు కూడా సరైన స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధుమిత్రులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నందువల్ల శుభ వార్తలు వినడం, అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుంటుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వ్యాపారాలకు ఇబ్బందేమీ ఉండదు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వారం ద్వితీయార్థంలో మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది. రాశ్యధిపతి గురువు  సప్తమ స్థానంలో, ఉచ్ఛ శుక్రుడు చతుర్థ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా వృత్తి, ఉద్యోగాల్లో డిమాండ్  పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. కొందరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం, తృతీయంలో రాశ్యధిపతి శనితో ఉచ్ఛ శుక్రుడు కలవడం వల్ల ఈ వారమంతా యోగదాయకంగా గడిచిపోతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కొద్దిగా కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ జీవితంలో అనుకోకుండా కొద్దిగా చికాకులు తలెత్తే సూచనలున్నాయి. ఒక శుభ కార్యంలో ఇష్టమైన బంధువుల్ని కలుసుకునే అవకాశం ఉంది.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడడం, ధన స్థానంలో ఉన్న రాశ్యధిపతి శనితో ఉచ్ఛ శుక్రుడు కలవడం వల్ల వారం రోజుల జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. అనుకున్నవి అనుకున్నట్టు సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులుంటాయి. అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఈ రాశిలో కుజ సంచారం వల్ల తరచూ కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఇష్టమైన దైవ కార్యాల్లో పాల్గొంటారు.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛపట్టడం, రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. సౌకర్యాల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నష్టదాయ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆఫర్లు అందుతాయి.

12 / 12
Follow Us