గర్జించనున్న భారత యుద్ధ విమానాలు
భారత వాయుసేన 'వాయుశక్తి-2026' మెగా విన్యాసాలు ఫోఖ్రాన్‌లో ప్రారంభం కానున్నాయి. రాఫెల్, తేజస్ వంటి అధునాతన విమానాలు, స్పైడర్ క్షిపణులు తమ శక్తిని ప్రదర్శిస్తాయి. రాష్ట్రపతి, రక్షణ మంత్రి హాజరయ్యే ఈ కార్యక్రమంలో భారత వాయుసేన పోరాట సంసిద్ధత, స్వదేశీ రక్షణ సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పడమే ప్రధాన ఉద్దేశ్యం.
భారత వాయుసేన తన అమ్ములపొదిలోని యుద్ధ తంత్రాన్ని, ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు సిద్ధమైంది. రాజస్థాన్‌లోని ఫోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ‘వాయుశక్తి-2026’ మెగా విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. పాకిస్థాన్ సరిహద్దుకు కేవలం 270 కి.మీ దూరంలో జరిగే ఈ ప్రదర్శనతో ఎడారి గగనతలం యుద్ధ విమానాల గర్జనతో ప్రతిధ్వనించనుంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజస్థాన్ గవర్నర్ మరియు ముఖ్యమంత్రితో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ ప్రదర్శనలో స్వదేశీ తేజస్‌తో పాటు రాఫెల్, సుఖోయ్-30 MKI, జాగ్వార్, మిరాజ్-2000 వంటి శక్తివంతమైన విమానాలు తమ శక్తిని ప్రదర్శించనున్నాయి. అంతేకాదు.. అపాచీ, చినూక్, ఎల్‌సీహెచ్ (LCH) హెలికాప్టర్లతో పాటు సి-17, సి-130జె వంటి భారీ రవాణా విమానాలు ఈ విన్యాసాల్లో భాగం కానున్నాయి. స్పైడర్ క్షిపణి వ్యవస్థలు, అధునాతన డ్రోన్ వ్యతిరేక వ్యవస్థలు (C-UAS) తమ సామర్థ్యాన్ని ప్రదర్శించనున్నాయి . ‘ఆపరేషన్ సిందూర్’ వంటి యుద్ధ క్షేత్ర వ్యూహాలను ప్రతిబింబిస్తూ, భారత వాయుసేన పోరాట సంసిద్ధతను మరియు స్వదేశీ పరిజ్ఞానాన్ని చాటిచెప్పడమే ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశ్యం. ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించడంలో భారత వాయుసేన నైపుణ్యం ఈ ప్రదర్శనతో మరోసారి వెల్లడి కానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశాఖ షిప్‌యార్డ్‌లో.. హడలెత్తిస్తున్న విషసర్పాలు
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం
నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..
Lunar Eclipse 2026: చంద్రగ్రహణం నాడు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే
Driving Licence: ఇకపై గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్.. కేంద్రం కొత్త విధానం
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం
నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..
దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం
అర్థరాత్రి రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..

