AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Driving Licence: ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం

Driving Licence: ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం

Phani CH
|

Updated on: Feb 28, 2026 | 4:50 PM

Share

కేంద్రం గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్ల పాయింట్లు తగ్గిస్తారు. పాయింట్లు సున్నాకు చేరితే లైసెన్స్‌ ఆరు నెలల పాటు రద్దవుతుంది. పదేపదే ఉల్లంఘిస్తే శాశ్వత రద్దుకు అవకాశం ఉంది. నితిన్ గడ్కరీ ప్రకటించిన ఈ విధానం బాధ్యతాయుత డ్రైవింగ్‌ను ప్రోత్సహించి, ఏటా జరుగుతున్న లక్షన్నరకు పైగా రోడ్డు ప్రమాద మరణాలను నివారించడం లక్ష్యంగా పెట్టుకుంది.

గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతుంది. డ్రైవింగ్‌ లెసెన్స్‌ల జారీలో గ్రేడ్‌ పాయింట్‌ వ్యవస్థను తీసుకురాబోతున్నామని నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ఇందులో ప్రతీ వాహనదారుడికి కొన్ని గ్రేడ్‌ పాయింట్లు ముందే కేటాయిస్తారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినప్పుడల్లా కొన్ని పాయింట్లు తగ్గిస్తారు. అలా మొత్తం పాయింట్లు సున్నాకు చేరినప్పుడు అతడి లైసెన్స్‌ను ఆరు నెలల పాటు రద్దు చేస్తారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ వ్యవస్థను త్వరలో తీసుకొస్తున్నట్లుగా వివరించారు. బాధ్యతాయుత డ్రైవింగ్‌ను ప్రోత్సహించడానికి, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఈ రూల్‌ తీసుకురానున్నారు. ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనకు లైసెన్స్‌ను రద్దు చేయడమూ ఈ విధానంలో భాగం. డ్రైవింగ్‌ చేస్తూ సెల్‌ ఫోన్‌ వాడటం, అధిక వేగం, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌, మద్యం సేవించి డ్రైవింగ్‌, సిగ్నళ్లను పట్టించుకోకపోవడం వల్ల ఏటా దేశంలో 1.8 లక్షల మంది మరణిస్తున్నారని కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం తెలిపారు. చాలామందికి చట్టమంటే భయం, గౌరవం లేకుండా పోయిందని, అందుకే తాము గ్రేడ్‌ల వారీ డ్రైవింగ్‌ లెసెన్స్‌ల విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం

Vishnu Vinyasam:విష్ణు విన్యాసం లో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇవే

Bigg Boss Nikhil: నిఖిల్ న్యూ లగ్జరీ హౌస్‌..! మామూలుగా లేదుగా..

Janhvi Kapoor: నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్

Follow Us