AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..

ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరో. అప్పట్లో వరుసగా సూపర్ హిట్స్ అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మెప్పించిన అతడు.. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యాడు. చాలా కాలం తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొన్నాడు. కానీ అక్కడు కూడా ఎక్కువ కాలం ఉండలేకపోయారు.

Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..
Sandeep Reddy Vanga
Rajitha Chanti
|

Updated on: Feb 28, 2026 | 7:02 PM

Share

బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్‌లో పాల్గొన్న నటుడు ఆదిత్య ఓం, తన సినీ ప్రయాణం, బిగ్ బాస్ అనుభవాలు, దర్శకులతో పని చేయడానికి ఆయన అనుసరిస్తున్న ప్రత్యేకమైన పద్ధతి గురించి ఒక ఇంటర్వ్యూలో వివరించారు. బిగ్ బాస్ హౌస్‌లో తన అనుభవం గురించి మాట్లాడుతూ, ఆదిత్య ఓం మొదట ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. తాను హోంవర్క్ చేయకుండానే హౌస్‌లోకి ప్రవేశించానని, మొదటి కొన్ని వారాల్లో గేమ్ అర్థం కాలేదని పేర్కొన్నారు. లోపల ఉన్నప్పుడు బయటపడాలనే ఆలోచన మాత్రమే ఉండేదని, తోటి కంటెస్టెంట్లు చాలా చిన్నవారు కావడంతో వారితో పోటీ పడటం సముచితం కాదని భావించానని చెప్పారు. అయితే, బిగ్ బాస్ తర్వాత తోటి కంటెస్టెంట్లైన సోనియా, నిఖిల్, శేఖర్, బేబక్క, సీతా, మణికంఠ వంటి వారితో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నానని, వారి సినిమా ఫంక్షన్లకు కూడా హాజరవుతున్నారని తెలిపారు. బిగ్ బాస్ ముగిసిన తర్వాత, కంటెస్టెంట్లకు బిగ్ బాస్‌ను మరిచిపోయి తమ కెరీర్‌పై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చానని, ఎవరూ ఇంటికి వచ్చి అవకాశాలు ఇవ్వరని, స్వయంగా ప్రయత్నించాలని సూచించానని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

25 సంవత్సరాలుగా పరిశ్రమలో ఉన్నప్పటికీ, తెలుగు, తమిళం, హిందీ చిత్రాల కోసం ఇప్పటికీ ఆడిషన్లు ఇస్తానని చెప్పారు. దర్శకులకు మెసేజ్‌లు పంపి వారిని పిచ్చోళ్లని చేస్తానని, ఎందుకంటే మరో మార్గం లేదని ఆయన అన్నారు. ఆత్మగౌరవం అడ్డు వస్తుందా అని అడిగినప్పుడు, సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ “బెగ్గర్” అని, ప్రతి ఒక్కరూ ఉన్నతమైన వారితో పని చేయాలనుకుంటారని, దీన్ని ఆత్మగౌరవంగా కాకుండా సినిమా పట్ల అభిరుచిగా చూడాలని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ప్రస్తుతం ఆయన రాజమౌళి, సుకుమార్, బోయపాటి శ్రీను, సందీప్ రెడ్డి వంగా వంటి ప్రముఖ దర్శకులతో పని చేయాలని ఆశిస్తున్నారు. ముఖ్యంగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోయే స్పిరిట్ చిత్రంలో అవకాశం కోసం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మెసేజ్‌లు పంపుతున్నట్లు, దాన్నే ఆయన “ట్రోలింగ్” అని పేర్కొన్నారు. వంగా నుండి ఒక చిన్న స్పందన వస్తే చాలని, “ఒక అంగుళం ఇస్తే, ఆరు అడుగులు తీసుకుంటాను” అని అన్నారు. బోయపాటి శ్రీనుతో రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నానని, మంచి పాత్ర ఇస్తే తప్ప ఇవ్వనని ఆయన చెప్పారని తెలిపారు. ఈ రోజుల్లో దర్శకులను కలవడం 20 ఏళ్ల క్రితం కంటే చాలా కష్టమని, మేనేజర్లు, స్టాఫ్‌, బౌన్సర్ల వంటి “బ్యారియర్‌లు” పెరిగాయని ఆయన వాపోయారు. అయితే, తన ప్రయత్నాలను కొనసాగిస్తానని, త్వరలో ఈ దర్శకులతో పని చేసే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆదిత్య ఓం అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

Sandeep Reddy Vanga, Aditya

Sandeep Reddy Vanga, Aditya

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

Follow Us
సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా..
సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా..
కేథరిన్ థ్రెసా జోరు.. ఇటు సినిమాలు, అటు ఓపెనింగ్స్..!
కేథరిన్ థ్రెసా జోరు.. ఇటు సినిమాలు, అటు ఓపెనింగ్స్..!
అర్ధరాత్రి ఆస్పత్రికి మాస్క్‌‌తో తచ్చాడిన ఓ మహిళ.. ఎవరా అని..
అర్ధరాత్రి ఆస్పత్రికి మాస్క్‌‌తో తచ్చాడిన ఓ మహిళ.. ఎవరా అని..
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే