Sambarala Yeti Gattu: రాక్షసుడి ఆగమనం..! దుమ్మురేపిన తేజ్ సంబరాల ఏటిగట్టు గ్లింప్స్.
కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు సాయి ధరమ్ తేజ్. విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తేజ్ ఆతర్వాత బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాడు తేజ్.

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. తేజ్ తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు. సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూశాడు. కెరీర్ లో ఎన్నో ఫ్లాప్స్ చూశాడు. ఆతర్వాత ఆచితూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. చిత్రలహరి, సోలో బ్రతుకే సోబెటర్, రిపబ్లిక్, విరూపాక్ష సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు తేజ్. విరూపాక్ష సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విరూపాక్ష తర్వాత బ్రో అనేసినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు సంబరాల ఏటిగట్టు అనే సినిమాతో రాబోతున్నాడు తేజ్.
ఇదెక్కడి మూవీ రా బాబు..! సినిమా మొత్తం ఆ సీన్లే.. దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో మాత్రం
రోహిత్ కేపీ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్ అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. ముఖ్యంగా ఇందులో సాయి ధరమ్ తేజ్ న్యూ లుక్ చేసి మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
తస్సాదియ్యా.. ఇది కదా మార్పు అంటే..! 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ లో నటించిన ఈ చిన్నది ఎంత
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరపుకొంటోంది. తాజాగా ‘సంబరాల ఏటిగట్టు’ టీమ్ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. తాజాగా సంబరాల ఏటిగట్టు సినిమా గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా తేజ్ లుక్స్ అదిరిపోయాయి అనే చెప్పాలి. గ్లింప్స్ లో పెద్దగా డైలాగ్స్ లేకపోయినా.. గ్లింప్స్ మాత్రం మెప్పించింది. అసుర సంధ్య వేళ మొదలైంది.. రాక్షసుల ఆగమనం అనే డైలాగ్ మాత్రమే గ్లింప్స్ లో చూపించారు. ఈ గ్లింప్స్ లో తేజ్ అదిరిపోయే కండలు తిరిగిన బాడీతో ఆకట్టుకున్నాడు.








