ఐరెన్ లెగ్ అన్నారు.. 9 సినిమాలనుంచి తీసేసారు.. కట్ చేస్తే పాన్ ఇండియా హీరోయిన్
హీరోయిన్స్ చాలా మంది అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు సందడి చేస్తుండటంతో చాలా మంది ముద్దుగుమ్మలు బడా సినిమాల్లో అవకాశలకోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. స్టార్ డమ్ వచ్చినా కూడా కొంతమంది భామలు అవకాశాల కోసం ఎదురుచూడక తప్పడం లేదు.

మాములుగా ఇండస్ట్రీలో నటీనటులుగా రాణించడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా హీరోయిన్స్ కు.. వారు అనేక ఇబ్బందులు, సమస్యలు, అవమానాలు సవాళ్లను ఎదుర్కొని.. ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం స్టార్ హోదాలో ఉన్న తారలు చాలా కాలంగా ఒక్క సరైన అవకాశం కోసం ఎదురుచూసినవాళ్లే.. కొంతమంది స్టార్ డమ్ వచ్చిన తర్వాత కూడా సినిమాలకోసం ఎదురుచూస్తున్నారు. వచ్చిన ప్రతి ఆఫర్ ఉపయోగించుకుని సహజ నటనతో ప్రేక్షకులను హృదయాలను గెలుచుకున్నారు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసింది. ప్రస్తుతం సినీరంగంలో అగ్రకథానాయికగా దూసుకుపోతున్న ఈ హీరోయిన్ కూడా కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. తనను ఐరెన్ లెగ్ అనే ముద్ర వేశారని.. దీంతో రాత్రికి రాత్రే తనను 9 ప్రాజెక్ట్స్ నుంచి తీసేశారని చెప్పుకొచ్చింది. కట్ చేస్తే ఆమె ఇప్పుడు ఆమె ఇండియా హీరోయిన్.. ఆమె ఎవరంటే..
ఆమె మరెవరో కాదు డర్టీ పిచ్చర్ సినిమాతో ఒక్కసారిగా కుర్రాళ్ల గుండెల్లో బాణాలు దింపిన విద్య బాలన్. గతంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విద్యా బాలన్ మాట్లాడుతూ.. “కెరీర్ మొదట్లో హీరో మోహన్ లాల్ జోడిగా చక్రం సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని తెలిపింది.. అయితే షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే ఆ సినిమా అనుకొనికరణల వల్ల ఆగిపోయింది. అందుకు నేను కారణం అంటూ ప్రచారం జరిగింది. దీంతో కొందరు నాపై ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసి నాపై విమర్శలు చేశారు.
ఆ ఒక్క సినిమా ఆగిపోయిందని తెలిసి..ఐరెన్ లెగ్ అని ముద్ర వేయడంతో రాత్రికి రాత్రే నన్ను 9 ప్రాజెక్ట్స్ నుంచి తొలగించారు. అసలు ఆ సినిమా ఆగిపోవడానికి నేను కారణం కాదు. ఆ సినిమా డైరెక్టర్, మోహన్ లాల్ మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో ఆ ప్రాజెక్ట్ ఆపేశారు. కానీ ఆ సినిమా నా కెరీర్ పై ఎంతో ప్రభావం చూపించిందని చెప్పుకొచ్చింది విద్యా బాలన్.. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విద్యా బాలన్ ఆచితూచి సినిమాలు చేస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








