ఏమైందో ఏమోగానీ సినిమాలకు గుడ్ బై చెప్పింది.. ఈ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్‌ను గుర్తుపట్టారా.?
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ముద్దుగుమ్మలు తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నారు. చేసిన సినిమాలు తక్కువే అయినా.. స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న భామలు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ చిన్నది ఒకరు. ఆమె ఎవరోగుర్తుపట్టారా ..?

ముట్టుకుంటే కందిపోతుందేమో అనేలా ఉండే భామ.. గ్లామర్ ఒలకబోయడంలోనూ ముందుంటుంది.. చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి కూడా కానీ.. ఊహించని విధంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది..ఇప్పుడు అవకాశాలు లేక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. రెండు పెద్ద హిట్స్ పడ్డాయి కానీ ఆతర్వాత అవకాశాలు అందుకోలేకపోయింది. ఇండస్ట్రీలో చాలా మంది భామలు కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. వరుసగా సినిమాలు చేసి మెప్పించినా కూడా ఆతర్వాత ఊహించని విధంగా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు కొందరు. చాలా మంది పెళ్లి చేసుకొని నటనకు గుడ్ బై చెప్పేశారు. కానీ ఇంకొంతమంది ఆఫర్స్ లేక సతమతం అవుతున్నారు. ఇక అలాంటి వారిలో ఈ భామ ఒకరు. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఆఫర్స్ లేకపోయినా ఇప్పుడు తన అందాలతో దర్శక నిర్మాతలను ఆకర్షిస్తుంది ఈ చిన్నది.
బిగ్ బాస్ హౌస్‌లోకి అదిరేటి అందం.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ బ్యూటీ..
పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ ఎవరో కాదు.. జూనియర్ ఐశ్వర్య రాయ్ గా క్రేజ్ తెచ్చుకున్న స్నేహాఉల్లాల్. 2007లో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిందీ అందాల తార. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో మెప్పించింది. ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తన నీలికళ్లతో ఐశ్వర్యను గుర్తు చేస్తూ కుర్రకారును ఆగం చేసింది. ఆ తర్వాత కరెంట్ మూవీలో యంగ్ హీరో సుశాంత్ తో జతకట్టింది. ఈ సినిమా కూడా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. అలాగే నందమూరి బాలకృష్ణ నటించిన సింహా సినిమాలోనూ హీరోయిన్ గా మెరిసింది. అయితే ఈ సినిమాల తర్వాత స్నేహ ఉల్లాల్ కు సినిమా అవకాశాలు కనుమరుగైపోయాయి. వరుడు, అలా మొదలైంది సినిమాల్లో క్యామియో రోల్స్ కే పరిమితమైంది.
ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. 27ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో నాగార్జున రొమాన్స్
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ తో కలిసి నటించిన మడత కాజా సినిమా కూడా పరాజయం పాలైంది. అలాగే యాక్షన్ త్రీడీ, అంతా నీమాయలోనే సినిమాల్లో మెరిసినా అవి కూడా ప్లాఫ్ లుగానే మిగిలిపోయాయి. కన్నడ, హిందీ సినిమాల్లోనూ అదృష్టం పరీక్షించుకున్నా స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. చివరిసారిగా 2022లో లవ్యూ లోక్ తంత్ర అనే హిందీ సినిమాలో నటించింది స్నేహ ఉల్లాల్. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది. ఈ అమ్మడు క్రేజీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
ఇదెక్కడి మూవీ రా బాబు..! సినిమా మొత్తం ఆ సీన్లే.. దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో మాత్రం
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








