బిగ్ బాస్ హౌస్‌లోకి అదిరేటి అందం.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ బ్యూటీ..
బిగ్‌బాస్ సీజన్ 9.. వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారంటూ ముందే కంటెస్టెంట్లకు చెప్పేశాడు బిగ్‌బాస్. రణరంగం మీ ఊహలకు అంచనాలకు అందని ప్రదేశం.. ఏదైతే మీకు ఖచ్చితమైన గెలుపు అనిపిస్తుందో అదైనా.. ఏదైతే నిస్సహాయ స్థితి అనిపిస్తుందో అదైనా.. ఈ రెండు ఒక్క చిటికెలో మారిపోతాయి. కెప్టెన్ రామ్, ఇమ్మాన్యుయేల్ మినహా అందరూ డేంజర్ లో ఉన్నారు. వీరికి ఈ వారం పెద్ద ప్రమాదం పొంచి ఉంది.

బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకు ఆసక్తికరంగా సాగుతుంది..హౌస్ లో హౌస్ మేట్స్ మధ్య గొడవలు, మాటల యుద్దాలు, వాదనలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే హౌస్ నుంచి ఒక సెలబ్రెటీ, ముగ్గురు కమానర్స్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ శెట్టి, హరీష్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.. తనూజ, సుమన్ శెట్టి, కళ్యాణ్ పడాల, సంజన, రీతూ చౌదరి, భరణి, శ్రీజ, దివ్య నిఖిత, డీమాన్ పవన్, ఫ్లోరా షైనీ ఈ పది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. ఈ పది మంది నామినేషన్‌లో ఉండటంతో ఈవారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది.
ఇది కూడా చదవండి : ఇదెక్కడి సినిమారా మావ ..! పెట్టింది రూ.5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు
ఎందుకంటే.. 11వ తేదీన బిగ్ బాస్ సీజన్ 9 రణరంగం 2.0 పేరుతో ఆరుగురు కంటెస్టెంట్స్‌ని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి పంపనున్నారని తెలుస్తుంది. ఈసారి హౌస్‌లోకి ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలను ఎంపిక చేసి హౌస్‌లోకి పంపిస్తున్నారు. ఈ ఐదోవారంలోనే డబుల్ ఎలిమినేషన్‌కి 100 పర్సెంట్ ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఓ అందాల భామ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన రమ్య మోక్ష.
ఇది కూడా చదవండి : స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. అతని వల్ల తొమ్మిదేళ్లు ఆ పని చేయలేదన్న హీరోయిన్
సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే హడావిడి అంతా ఇంతా కాదు.. తన అందంతో అదరగొడుతూనే తమ పచ్చళ్ళను ప్రమోట్ చేసుకుంది ఈ చిన్నది. ఇక ఈ చిన్నదాని అందానికి నెటిజన్స్ ఫిదా అయ్యారు. ఈ బ్యూటీ తన అందంతో మతిపోగొడుతోంది. దాంతో వచ్చిన క్రేజ్ తో ఈ సారి ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. చాలా రోజులుగా ఈ ముద్దుగుమ్మ పేరు బిగ్ బాస్ హౌస్‌కు వెళ్లే వారి లిస్ట్‌లో వినిపిస్తూనే ఉంది. ఈసారి రమ్యమోక్ష ఎంట్రీ ఉంటుందని అంటున్నారు.
ఇది కూడా చదవండి : చేతిలో రూ. 5వేలు.. కడుపు నింపుకోవడానికి ఒక్క బ్రేడ్ మాత్రమే.. కట్ చేస్తే ఒక్క సాంగ్‌కు రూ. రెండు కోట్లకు పైగా అందుకుంటుంది
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








