AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. అతని వల్ల తొమ్మిదేళ్లు ఆ పని చేయలేదన్న హీరోయిన్

హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తూ క్రేజీ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. కొంతమంది తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు . ఓ హీరోయిన్ ఏకంగా స్టార్ క్రికెటర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. అతని వల్ల తొమ్మిదేళ్లు ఆ పని చేయలేదన్న హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 08, 2025 | 8:22 PM

Share

కొంతమంది హీరోయిన్స్ సినిమాలతో పాపులర్ అవుతుంటే మరికొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిస్తుంటారు. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఏకంగా ఇండస్ట్రీనే షేక్ చేశాయి. స్టార్ క్రికెటర్ వల్ల తొమ్మిదేళ్లుగా శృంగారంలో పాల్గొనలేదని చెప్పి షాక్ ఇచ్చింది ఆమె.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె చెప్పిన ఆ క్రికెటర్ ఎవరంటే..

ఇది కూడా చదవండి : Ramyakrishna: ఇలా ఎలా తల్లి..! రమ్యకృష్ణ నటనకు దండం పెట్టాల్సిందే..

పాయల్ ఘోష్.. ఈ అమ్మడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.. తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం సినిమాలో హీరోయిన్ గా చేసింది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది ఈ అమ్మడు. ఆ తర్వాత హిందీలో పలు సినిమాలు చేసింది. ఈ అమ్మడి అసలు పేరు హారిక. సినిమాల్లోకి వచ్చాకా పాయల్ ఘోష్ గా మార్చుకుంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ సినిమాలలో నటించి మెప్పించింది ఈ చిన్నది. అయితే గత కొంత కాలంగా ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే వివాదాస్పద కామెంట్స్ వార్తల్లో మాత్రం నిలుస్తుంది. ఇప్పటికే ఆమె పేరు చాలా కాంట్రవర్సీలో వినిపించింది. స్టార్‌ హీరోలు, హీరోయిన్లపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ తెగ ట్రెండ్‌ అవుతోంది పాయల్. గతంలో ఓ స్టార్ క్రికెటర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది పాయల్. ఓ క్రికెటర్ తనను మోసం చేశాడు అని షాక్ ఇచ్చింది పాయల్. ఆ క్రికెటర్ మరెవరో కాదు స్టార్ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్. ఇర్ఫాన్ పఠాన్ తనతో ఐదేళ్లు డేటింగ్ చేశాడని తెలిపింది పాయల్. అలాగే గౌతం గంబీర్ పై కూడా సంచలన కామెంట్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ చేస్తా..! సంచలన కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్

గౌతం గంబీర్ నాకు ఎప్పుడూ మిస్డ్ కాల్స్ ఇచ్చేవాడు అని కామెంట్స్ చేసింది. గతంలో ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఇలా రాసుకొచ్చింది..  ఇర్ఫాన్ పఠాన్‌తో బ్రేకప్ అయ్యాక నేను తొమ్మిదేళ్లుగా నేను ఎవరితోనూ శృంగారంలో పాల్గొనలేదు. ఇది నిజం. ఆ తర్వాత నాతో ఒక వ్యక్తి శృంగారం చేయడానికి ట్రై చేశాడు కానీ దాని పట్ల గౌరవం ఉంది అని రాసుకొచ్చింది. ఎవరితో పడితే వారితో సెక్స్ చేయలేం’ అంటూ పోస్టును ఇన్ స్టాలో షేర్ చేసింది పాయల్. అలాగే మరికొన్ని పోస్ట్ లు కూడా షేర్ చేసింది. 2016లో ఒకసారి ఇర్ఫాన్ ఇంటికి వెళ్ళాను.. మా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయడం లేదు అని చెప్పాడు. అప్పటి నుంచి మా మధ్య గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత అతని సిస్టర్ ఫోన్ చేసి ఇర్ఫాన్ పఠాన్‌ కు పెళ్లి కాబోతుందని చెప్పింది. అది విని షాక్ అయ్యాను అని రాసుకొచ్చింది. అలాగే.. మా నాన్నకు ముసల్మాన్స్ అంటే ఇష్టం ఉండదు కానీ నేను ఎప్పుడూ అతనికి మద్దతిగానే నిలిచా.. నేను ఎప్పుడూ చీట్ చేయలేదు.. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి అని రాసుకొచ్చింది పాయల్.. ఆ పోస్ట్ లు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఈ అమ్మడికి మద్దతు తెలుపుతుంటే మరికొంతమంది పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు ఓ స్టార్ హీరోకి కాబోయే భార్య.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!