AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ పాత్ర చేసే ఛాన్స్ వస్తే కళ్లకు అద్దుకొని ఓకే చేస్తా.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ బడా సినిమాలకోసం ఎదురుచూస్తూ ఉంటారు.. కొంతమంది ఆఫర్స్ వచ్చిన కూడా ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ ఛాన్స్ లకు నో చెప్తూ ఉంటారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ రామాయణం సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకుంది వార్తలు వచ్చాయి.

ఆ పాత్ర చేసే ఛాన్స్ వస్తే కళ్లకు అద్దుకొని ఓకే చేస్తా.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 06, 2025 | 12:29 PM

Share

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అనేది చాలా పెద్ద విషయం. చాలా మంది హీరోయిన్స్ పెద్ద సినిమాల్లో ఛాన్స్ లకోసం ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. ఒక్క సినిమా వస్తే స్టార్ డమ్ వస్తుందని ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు సందడి చేస్తున్న నేపథ్యంలో చాలా మంది హీరోయిన్స్ హీరోయిన్స్ బడా సినిమాల్లో ఛాన్స్ లకోసం ఎదురుచూస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ పెద్ద సినిమాల్లో ఛాన్స్ వస్తే నో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలకు నో చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ క్రేజీ బ్యూటీ బాలీవుడ్ మూవీ రామాయణం సినిమాలో సీత పాత్రకు నో చెప్పిందని టాక్ వినిపిస్తుంది. దాని పై ఆమె క్లారిటీ కూడా ఇచ్చింది. అవన్నీ అబద్దాలు అంటుంది ఆ ముద్దుగుమ్మ ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి :ఈ ఫొటోలో ఉన్న అన్న చెల్లెల్లు.. ఇప్పుడు టాలీవుడ్ హీరో, హీరోయిన్స్.. ఎవరో తెలుసా.?

కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ శ్రీ నిధి శెట్టి. కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది. అంతే కాదు విడుదలైన అన్ని ఏరియాల్లో సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో హీరో యశ్ తో పాటు హీరోయిన్ శ్రీ నిధి కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత కేజీఎఫ్ 2లోనూ నటించింది. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాదించిన తర్వాత ఈ చిన్నది తమిళ్ సినిమా కోబ్రాలో నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు తెలుగులోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. నేచురల్ స్టార్ నానితో కలిసి హిట్ 3లో నటించింది. శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3 సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇది కూడా చదవండి :ఒకే ఒక్క డిజాస్టర్ పడింది..! దెబ్బకు ఏడాదికి పైగా కనిపించకుండా పోయింది..

ఈ సినిమాతో పాటు ఇప్పడు తెలుగులో మరో సినిమా చేస్తుంది. సిద్దూజొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తెలుసుకదా అనే సినిమాలో నటిస్తుంది. శ్రీనిధి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. అయితే తనకు రామాయణం సినిమాలో సీత పాత్ర ఛాన్స్ వస్తే నో చెప్పిందని ఓ రూమర్ ఉంది. దీని పై ఆమె స్పందిస్తూ.. రామాయణం సినిమా ఆడిషన్ కు నేను వెళ్ళా.. ఆడిషన్ ఇచ్చా.. కానీ ఆతర్వాత నాకు మేకర్స్ నుంచి, సినిమా ఆఫీస్ నుంచి ఎలాంటి కాల్ రాలేదు. పెద్ద సినిమాను, పైగా సీతమ్మ పాత్రను రిజక్ట్ చేసేంత పెద్ద యాక్టర్ ను నేను కాదు అని శ్రీనిధి చెప్పుకొచ్చింది. సీత పాత్ర వస్తే కళ్లకు అద్దుకొని ఓకే చేస్తా.. కానీ నేను ఆడిషన్ ఇచ్చా.. మేకర్స్ దగ్గర పెద్ద లిస్ట్ ఉంటుంది. అందులో నేను సెలక్ట్ కాలేదు అంతే.. అని చెప్పుకొచ్చింది శ్రీనిధి శెట్టి..

ఇది కూడా చదవండి : బుర్రపాడు సిరీస్ బ్రో.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్ లు.. ఎక్కడ చూడొచ్చంటే

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్