AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spirit Villain Poster: వివేక్ ఒబేరాయ్ లుక్ అరాచకం! ‘స్పిరిట్’ విలన్ పక్కన ఉన్న మిస్టరీ గర్ల్ ఎవరు?

రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఈ రెండు పేర్లు కలిస్తేనే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు మొదలవుతాయి. వీరిద్దరి కలయికలో రాబోతున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా కోసం యావత్ దేశం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది.

Spirit Villain Poster: వివేక్ ఒబేరాయ్ లుక్ అరాచకం! ‘స్పిరిట్’ విలన్ పక్కన ఉన్న మిస్టరీ గర్ల్ ఎవరు?
Spirit 12
Nikhil
|

Updated on: Feb 28, 2026 | 10:39 PM

Share

తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి వెలువడిన ఒక అప్డేట్ నెట్టింట మంటలు రేపుతోంది. హీరో లుక్ కంటే విలన్ లుక్ తోనే గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఈ సినిమాలో, ఒక కొత్త భామ ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్.. కానీ జైలు గోడల మధ్య కనిపిస్తాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ ఒక సునామీలా ఉంటుంది. అలాంటి హీరోను ఢీకొట్టే విలన్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉండాలి కదా!

అందుకే బాలీవుడ్ మాస్ విలన్ వివేక్ ఒబేరాయ్‌ను రంగంలోకి దింపారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తాజాగా విడుదలైన విలన్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే అందరి దృష్టి వివేక్ ఒబేరాయ్ పక్కన ఉన్న ఒక కొత్త అమ్మాయిపై పడింది. ఒక్క పోస్టర్‌తోనే అందరినీ ఆకర్షించిన ఆ భామ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఆ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ప్రభాస్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’.

బాడ్ హ్యాబిట్..

“వన్ బ్యాడ్ హ్యాబిట్ ఇన్ స్పిరిట్ మోడ్” అనే ట్యాగ్‌తో విడుదల చేసిన పోస్టర్‌లో వివేక్ ఓబెరాయ్ ఊహించని రేంజ్ లో కనిపిస్తున్నారు. నోట్లో సిగార్‌తో, కళ్లలో క్రూరత్వంతో ఆయన ఒక పక్కా మాఫియా డాన్ పాత్రలో నటిస్తున్నట్లు అర్థమవుతోంది. గతంలో ‘రక్త చరిత్ర’ వంటి సినిమాల్లో తన నటనతో భయపెట్టిన వివేక్, ఇప్పుడు ప్రభాస్ ను ఎదుర్కొనే పవర్ ఫుల్ విలన్ గా సరికొత్త అవతారంలో మెరవబోతున్నారు.

ఎవరీ ఐశ్వర్య దేశాయ్?

వివేక్ పక్కన గ్లామరస్‌గా కనిపిస్తున్న ఆ యువతి పేరు ఐశ్వర్య దేశాయ్. ఈమె అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ నుండి మార్కెటింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఇండో-అమెరికన్ నటి. బాలీవుడ్ హిట్ సినిమా ‘గల్లీ బాయ్’లో చిన్న పాత్రలో కనిపించిన ఐశ్వర్య, ‘ర్యాట్ ఇన్ ద కిచెన్’ అనే షార్ట్ ఫిలిం ద్వారా ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ‘స్పిరిట్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెడుతున్నారు. పోస్టర్‌లో ఆమెను విలన్ పక్కన చూపించడాన్ని బట్టి, కథలో ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పటివరకు చూడని విధంగా ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ తో పాటు బలమైన పోలీస్ డ్రామా ఇందులో ఉండబోతోంది. ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా రిలీజ్..

పాన్ ఇండియా సినిమాగా మాత్రమే కాకుండా, ‘స్పిరిట్’ ప్రపంచవ్యాప్తంగా పలు విదేశీ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. తెలుగు, హిందీతో పాటు చైనీస్, కొరియన్ భాషల్లో కూడా వచ్చే ఏడాది మార్చి 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా మార్కు హింస, ప్రభాస్ మార్కు మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. విలన్ పోస్టర్ తోనే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లిన ‘స్పిరిట్’, కచ్చితంగా ప్రభాస్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు నమ్ముతున్నారు.

Follow Us