AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

Phani CH
|

Updated on: Apr 11, 2026 | 6:16 PM

Share

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి శుక్రవారం నుంచి కొత్త టోల్ నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. ఇకపై టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు పూర్తిగా రద్దు. ప్రతి వాహనానికి ఫాస్టాగ్ తప్పనిసరి. ఫాస్టాగ్ లేకపోయినా లేదా బ్యాలెన్స్ లేకపోయినా, యూపీఐ ద్వారా చెల్లిస్తే సాధారణ టోల్ కంటే 1.25 రెట్లు అధిక ఛార్జీలు పడతాయి. ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి, రద్దీ తగ్గించడానికి ఈ నిర్ణయం. ముందుగానే ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోండి.

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు అలర్ట్. టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేస్తూ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి అన్ని టోల్ ప్లాజాల్లో కొత్త నిబంధనలు కఠినంగా అమలులోకి వస్తున్నాయి. ఇకపై టోల్ గేట్ల వద్ద చిల్లర కష్టాలకు, నగదు చెల్లింపులకు పూర్తిస్థాయిలో గుడ్‌బై చెప్పేశారు. ప్రతి వాహనానికి ఫాస్టాగ్ ఉండటం ఇప్పుడు అనివార్యం. ఒకవేళ వాహనానికి ఫాస్టాగ్ లేకపోయినా లేదా అందులో బ్యాలెన్స్ లేకపోయినా.. యూపీఐ (UPI) ద్వారా చెల్లించే అవకాశం కల్పించారు. అయితే, ఇక్కడే ఒక నిబంధన ఉంది. యూపీఐ ద్వారా చెల్లించే వారు సాధారణ టోల్ ధర కంటే 1.25 రెట్లు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే, నగదు రూపంలో గానీ, సాధారణ డిజిటల్ పద్ధతిలో గానీ తక్కువ ధరకే వెళ్లడం ఇక సాధ్యం కాదు. నిబంధనలు అతిక్రమించి, టోల్ గేట్ వద్ద నగదు ఇస్తామని మొండికేస్తే, హైవేపైకి వాహనాన్ని అనుమతించబోరు. టోల్ చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు ఆన్‌లైన్ ద్వారా జరిమానాలు విధించడంతో పాటు, నేరుగా నోటీసులు పంపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే వాహనదారులు ముందుగానే తమ ఫాస్టాగ్ వాలెట్‌ను రీఛార్జ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు, ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాబట్టి, హైవే ప్రయాణానికి రెడీ అయ్యే ముందు మీ ఫాస్టాగ్ చెక్ చేసుకోవడం మర్చిపోకండి!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం

పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే

Follow Us