అతడంటే పిచ్చి ఇష్టం.. అలాంటి భర్తే రావాలి.. మీనాక్షి చౌదరి కామెంట్స్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

11 April 2026

తెలుగులో వరుస హిట్లతో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఈ అమ్మడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఇండస్ట్రీలో బిజీగా దూసుకుపోతుంది.

కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఎంచుకుంటూ క్రేజీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే గతంలో ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

ఒక ఇంటర్వ్యూలో మీనాక్షి తన వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి పంచుకుంది. తనకు టాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని, ఆయనే తన క్రష్ అని చెప్పుకొచ్చింది. 

ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రమే కాకుండా, ఆయన వ్యక్తిత్వం, సింప్లిసిటీ అంటే తనకు చాలా గౌరవమని ఆమె పేర్కొంది. ప్రభాస్ సినిమా కోసం ఎంతో వెయిట్ చేస్తానని తెలిపింది.

'గుంటూరు కారం', 'లక్కీ భాస్కర్', 'మట్కా' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మీనాక్షి చౌదరి.. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది.

మీనాక్షి ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకోవడంతో 'రెబల్ స్టార్' అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ సరసన మీనాక్షి నటిస్తే చూడాలని ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ అందాల భామ, భవిష్యత్తులో ప్రభాస్ సరసన నటించే అవకాశం దక్కించుకుంటుందేమో చూడాలి.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం లేటేస్ట్ గ్లామరస్ ఫోటోలతో కట్టిపడేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ కట్టిపడేస్తున్నాయి.