AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాల్కనీ నుంచి పడబోయిన చిన్నారిని కాపాడాడని అనుకునేరు.. ఆ తర్వాత సీన్ చూడగా..

కొన్ని వ్యూస్, లైకుల కోసం కన్న బిడ్డ ప్రాణాలనే పణంగా పెట్టాడో తండ్రి. అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి బాలుడిని దూకించి రీల్ తీయబోయి, ఆ చిన్నారి తండ్రి చేతుల్లోంచి జారి కిందపడిపోయిన భయంకర దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Viral Video: బాల్కనీ నుంచి పడబోయిన చిన్నారిని కాపాడాడని అనుకునేరు.. ఆ తర్వాత సీన్ చూడగా..
Viral Video
Ravi Kiran
|

Updated on: Apr 11, 2026 | 6:35 PM

Share

సోషల్ మీడియాలో కొన్ని లైకులు, షేర్ల కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. కన్న బిడ్డ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రమాదకరమైన స్టంట్‌లకు పాల్పడుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఇంటర్నెట్‌లో కలకలం రేపుతోంది. కేవలం ఒక రీల్ కోసం ఒక తండ్రి తన బిడ్డను అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి దూకించి, చివరకు అతడిని పట్టుకోవడంలో విఫలమై కింద పడేసిన దృశ్యాలు అందరినీ షాక్‌కు గురి చేశాయి.

ఇది చదవండి: కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పట్టుకుని పొట్ట ఎక్స్‌రే తీయగా

అసలేం జరిగింది?

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక వ్యక్తి తన కుమారుడితో కలిసి అపార్ట్‌మెంట్ బాల్కనీ వద్ద నిలబడి ఉన్నాడు. బహుశా ఏదో ఒక సినిమా సీన్ లేదా స్టంట్ రీక్రియేట్ చేయాలనే ఉద్దేశంతో, ఆ తండ్రి తన బిడ్డను బాల్కనీ రెయిలింగ్ అవతలి వైపు నుంచి దూకమని ప్రోత్సహించాడు. ఆ బాలుడు కూడా తండ్రి మీద నమ్మకంతో గాలిలోకి దూకాడు. అయితే, దురదృష్టవశాత్తు ఆ తండ్రి ఆ బిడ్డను సరిగ్గా పట్టుకోలేకపోయాడు. బాలుడు తండ్రి చేతుల్లోంచి జారి నేరుగా కింద పడిపోయాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వైరల్ అయ్యింది. ఆ తండ్రి నిర్వాకంపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. “కేవలం కొన్ని వ్యూస్ కోసం కన్న బిడ్డను ఇలా బలి ఇస్తారా?” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ‘లైకులు’ అనేవి ప్రాణాల కంటే ముఖ్యం కాదని, పిల్లల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రతి చిన్న విషయాన్ని రికార్డ్ చేయడం అలవాటుగా మారింది. కానీ, అది ప్రాణాంతకమైన స్టంట్లకు దారితీసినప్పుడు ఫలితం ఇలాగే ఉంటుంది. ఈ ఘటనలో ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు, కానీ ఇలాంటి పనులు పిల్లల మనసుపై, ప్రాణాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇది చదవండి: గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..

Follow Us