AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (ఏప్రిల్ 12-18, 2026): మేష రాశి వారికి ఈ వారమంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు తప్పకపోవచ్చు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారికి ఈ వారమంతా సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా చక్కబెడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 11, 2026 | 4:57 PM

Share
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, రాహు, శుక్రుల అనుకూలత వల్ల వారమంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ఆర్థిక, వృత్తి, ఉద్యోగ విషయాల్లో మీ మాటకు, చేతకు తిరుగుండదు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. పట్టుదలగా పనులన్నీ పూర్తి చేస్తారు. మిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. వినోద యాత్రకు ప్లాన్ చేస్తారు. వృత్తిపరంగా రాబడి పెరిగే అవకాశం ఉంది.  ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. వాహనాలను వేగంగా నడపకపోవడం మంచిది. విద్యార్థులు తేలికగా ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల మిశ్రమ ఫలితాలు తప్పకపోవచ్చు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పూర్తి చేస్తారు. ఆదాయం బాగానే  ఉంటుంది కానీ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల సలహాలు పనికి వస్తాయి. కొందరు మిత్రులతో వినోద యాత్ర చేస్తారు. ఆస్తి వివాదంలో తోబుట్టువులతో రాజీ మార్గం అనుసరిస్తారు. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): లాభ స్థానంలో గ్రహ బలం బాగా పెరిగింది. వారమంతా సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా చక్కబెడతారు. పెండింగు పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరాభిమానాలను చూరగొంటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహ కారాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసివస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): దశమ స్థానం బాగా పటిష్టంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. హోదా పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో బాగా లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆర్థిక పురోగతి లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరి ష్కారం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరుతాయి. మిత్రుల సాయంతో వ్యక్తిగత పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉన్నా, ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహనాలతో వీలైనంత అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవితో పాటు గురు, శుక్రుల బలం అధికంగా ఉండడం వల్ల ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. దూర ప్రాంతంలో ఉన్న బంధువులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగులకు కొత్త ఆఫర్ అందుతుంది. ఆర్థికంగా అదృష్టం పట్టే సూచనలున్నాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు వస్తాయి. స్నేహితులతో కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులలో ఒకరు చదువులు లేదా ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.  కొద్ది ప్రయత్నంతో విద్యార్థులు దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): గురు, బుధుల బలం బాగా ఉన్నందువల్ల కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. అనుకోకుండా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. బంధువులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. పెళ్లి సంబంధానికి సంబంధించి బంధువుల ద్వారా శుభవార్త వింటారు. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. విద్యార్థులు పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): గురు, శుక్ర, శని గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, మీ చేతకు తిరుగుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఇష్టమైన బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు. తోబుట్టువులతో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడి పంచమ స్థితి వల్ల వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడ తారు. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల కుటుంబంలో విభేదాలు, అపార్థాలకు అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి ఒత్తిడి కలిగిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. బంధువుల రాకపోకలుంటాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా గడిచిపోతాయి.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): గురు, రవి, బుధ గ్రహాలు అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్న కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల పరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో మీ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. శుభకార్యంలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారాలు విస్తరించుకోవడానికి, ఉద్యోగం మారేందుకు ప్రయత్నాలు చేయడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు. ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా సంతృప్తికరంగా సాగిపోతాయి.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వారమంతా కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి.  ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, కుటుంబ సభ్యుల మీద ఖర్చులు అదుపుతప్పుతాయి. డాక్టర్లు, లాయర్లకు క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి నిపుణులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ, అత్యవసరమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): గురు, బుద, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. డాక్టర్లు, లాయర్లకు మంచి అవకాశాలు అందుతాయి. వృత్తి నిపుణులకు కలిసి వచ్చే సమయం ఇది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశిం చిన సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన కార్యకలాపాలను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల అండదండలుంటాయి. ఇంటా బయటా అనుకూలతలు కనిపిస్తాయి. ఆర్థిక నష్టాలు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు చదువుల్లోనూ, పరీక్షల్లోనూ దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగుతుంది.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): కుజ, రవి, శుక్రుల అనుకూల సంచారం కారణంగా వారమంతా ప్రశాంతంగా, హాయిగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, గౌరవప్రదంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఒకటి రెండు చిరకాల కోరికలు నెరవేరుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టమైన మిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాల వల్ల కలిసి వస్తుంది. చదువులలో పిల్లలు విజయాలు సాధిస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందిని, అసంతృప్తిని కలిగిస్తాయి.

12 / 12
Follow Us