AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రిని ఇంటి నుంచి దూరం పెట్టిన కొడుకు, కోడలు.. హైకోర్టు సంచలన తీర్పు

ఆస్తుల కోసం ఆరాటాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో.. కన్నతండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తిని తన పేరుపై రాయించుకున్న తర్వాత, అదే తండ్రికి నిలువ నీడ లేకుండా చేస్తే అంతకంటే దారుణం ఏముంటుంది? జీవితాంతం కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో భారంగా భావించడం సమాజంలో ఆందోళన కలిగించే విషయం. ఈ క్రమంలోనే 88 ఏళ్ల వయసులో ఓ తండ్రి తన సొంత ఇంట్లోనే ఉండలేని పరిస్థితి రావడం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.

తండ్రిని ఇంటి నుంచి దూరం పెట్టిన కొడుకు, కోడలు.. హైకోర్టు సంచలన తీర్పు
Elder Parents
Balaraju Goud
|

Updated on: Nov 27, 2026 | 4:17 PM

Share

ముంబై: ఆస్తుల కోసం ఆరాటాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో.. కన్నతండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తిని తన పేరుపై రాయించుకున్న తర్వాత, అదే తండ్రికి నిలువ నీడ లేకుండా చేస్తే అంతకంటే దారుణం ఏముంటుంది? జీవితాంతం కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో భారంగా భావించడం సమాజంలో ఆందోళన కలిగించే విషయం. ఈ క్రమంలోనే 88 ఏళ్ల వయసులో ఓ తండ్రి తన సొంత ఇంట్లోనే ఉండలేని పరిస్థితి రావడం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. అయితే ఆస్తి బదిలీ అంటే తల్లిదండ్రులపై ఉన్న బాధ్యతలు తీరిపోయినట్లు కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ప్రేమతో నమ్మి ఆస్తిని రాసిస్తే.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం పిల్లల కనీస బాధ్యత. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు.. నాలుగు మంచి మాటలు, కొంత ఆప్యాయత, తలదాచుకునే గూడు. ఈ కేసులో తండ్రి నివాస హక్కును కాపాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. పిల్లలుగా మన బాధ్యతలను మరోసారి గుర్తుచేస్తోంది.

వృద్ధ తండ్రి తన జీవితాంతం నివసించేందుకు అనుమతించాలనే షరతుతో కొడుకుకు బదిలీ చేసిన ఫ్లాట్‌ను తిరిగి ఆయనకే అప్పగించాలని బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తండ్రి నివాస హక్కును గౌరవించడంలో కొడుకు, కోడలు విఫలమైనందున 2018లో రిజిస్టర్ చేసిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసింది. 15 రోజుల్లోగా ఫ్లాట్‌ను ఖాళీ చేసి తండ్రికి అప్పగించాలని, లేదంటే పోలీసుల సహాయంతో వారిని ఖాళీ చేయిస్తామని స్పష్టం చేసింది.

అసలు వివాదం ఏమిటంటే?

88 ఏళ్ల దేవ్‌చంద్ కోర్షి దేధియా 1999లో తన భార్య మంజులాతో కలిసి ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఫ్లాట్ కొనుగోలు చేశారు. 2015లో భార్య మరణించిన తర్వాత పెద్ద కుమారుడు శిబన్, కోడలు రీటా తనను చిన్న కుమారుడితో కలిసి ఉండాలని కోరారని ఆయన తెలిపారు. వ్యాపార అవసరాల పేరుతో తనతో పవర్ ఆఫ్ అటార్నీపై సంతకం చేయించుకుని, తనకు తెలియకుండానే ఫ్లాట్‌లోని వాటాలను కుమారుడి పేరుపైకి బదిలీ చేశారని ఆరోపించారు.

2018 జూన్ 4న తన జీవితకాలం ఫ్లాట్‌లో నివసించే హక్కు ఉంటుందనే షరతుతో కుమారుడికి గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేశారు. తన రోజువారీ అవసరాలను కొడుకు, కోడలు చూసుకుంటారని నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఆ తర్వాత వారు వేధింపులకు గురిచేశారని, కోవిడ్ సమయంలో ఫ్లాట్‌లోకి రానివ్వలేదని ఆరోపించారు. చివరకు వృద్ధాశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ట్రిబ్యునల్, అప్పీలేట్ అథారిటీ నిర్ణయాలు

2023 మార్చి 13న సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన తండ్రికి నెలకు రూ.10,000 భరణం చెల్లించాలని, గోడౌన్‌ను అప్పగించాలని 2024 మార్చి 14న ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే గిఫ్ట్ డీడ్ రద్దుకు నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని డిప్యూటీ కలెక్టర్ కూడా 2024 జూలై 10న సమర్థించారు. దీంతో తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు కీలక వ్యాఖ్యలు

జస్టిస్ ఆర్తి సాతే విచారణలో గిఫ్ట్ డీడ్‌లో తండ్రికి జీవితాంతం ఫ్లాట్‌లో నివసించే హక్కు స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఆ హక్కును కొడుకు, కోడలు తప్పనిసరిగా గౌరవించాలని చెప్పారు. తండ్రికి ప్రత్యేకంగా భరణం చెల్లించాలనే నిబంధన లేదనే కారణంతో గిఫ్ట్ డీడ్ రద్దును తిరస్కరించడం అధికారుల పొరపాటని వ్యాఖ్యానించారు.

తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం–2007లోని సెక్షన్లు 2(బి), 4, 5, 23లను కోర్టు ప్రస్తావించింది. భరణంలో ఆహారం, దుస్తులు, నివాసం, వైద్య చికిత్స కూడా భాగమని స్పష్టం చేసింది. తల్లిదండ్రుల ప్రాథమిక అవసరాలు తీర్చాలనే షరతుతో ఆస్తి బదిలీ జరిగి, ఆ బాధ్యతను లబ్ధిదారులు నిర్వర్తించకపోతే సెక్షన్ 23 ప్రకారం బదిలీని రద్దు చేయవచ్చని వివరించింది.

తుది ఆదేశాలు

తండ్రికి నివసించడానికి మరో స్థలం లేదని, ఆర్థికంగా బలహీనమైన పరిస్థితుల్లో వృద్ధాశ్రమంలో ఉంటున్నారని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. గృహ హింస చట్టం కింద ఫ్లాట్ ఉమ్మడి నివాసమనే కుమారుడి వాదనను కూడా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేస్తూ తండ్రి పిటిషన్‌ను అనుమతించింది. 15 రోజుల్లో ఫ్లాట్‌ను అప్పగించాలని కొడుకు, కోడలిని ఆదేశించింది. ఈ తీర్పుపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించింది.

ఈ తీర్పుతో వృద్ధ తల్లిదండ్రుల ఆస్తి హక్కులు, జీవితకాల నివాస హక్కుల పరిరక్షణకు బాంబే హైకోర్టు కీలక సందేశం ఇచ్చింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వృద్ధ తల్లిదండ్రుల ఆస్తి హక్కులపై హైకోర్టు కీలక తీర్పు..
వృద్ధ తల్లిదండ్రుల ఆస్తి హక్కులపై హైకోర్టు కీలక తీర్పు..
కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..
కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..
రూమ్ నెం. 7లో ఏముంది? ఇవాళే OTTలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్
రూమ్ నెం. 7లో ఏముంది? ఇవాళే OTTలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్
టీమిండియాపై కివీస్ వికెట్ కీపర్ అరుదైన ఘనత
టీమిండియాపై కివీస్ వికెట్ కీపర్ అరుదైన ఘనత
100 కిలోల బరువు ఉన్న నన్ను 500 మీటర్లు ఎత్తుకుని పరిగెత్తాడు..
100 కిలోల బరువు ఉన్న నన్ను 500 మీటర్లు ఎత్తుకుని పరిగెత్తాడు..
హిందూ క్యాలెండర్‌లో 12 నెలల పేర్లు ఎలా వచ్చాయి? దీని వెనుక ఖగోళ..
హిందూ క్యాలెండర్‌లో 12 నెలల పేర్లు ఎలా వచ్చాయి? దీని వెనుక ఖగోళ..
ఉద్యోగం మారే ప్రయత్నాల్లో వీరు సక్సెస్! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఉద్యోగం మారే ప్రయత్నాల్లో వీరు సక్సెస్! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
JBL కొత్త ఇయర్‌బడ్స్ లాంఛ్ .. కొత్త లుక్, కిర్రాక్ ఫీచర్స్ !
JBL కొత్త ఇయర్‌బడ్స్ లాంఛ్ .. కొత్త లుక్, కిర్రాక్ ఫీచర్స్ !
ఈఐఎంలు కడుతున్నారా? నటుడు హర్షవర్ధన్ మనీ సేవింగ్ టిప్స్
ఈఐఎంలు కడుతున్నారా? నటుడు హర్షవర్ధన్ మనీ సేవింగ్ టిప్స్
నాన్న నెల రోజులు కోమాలోకి వెళ్లడానికి కారణం ఇదే..
నాన్న నెల రోజులు కోమాలోకి వెళ్లడానికి కారణం ఇదే..
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే