AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madurai: తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ

Supreme Court On Madurai Karthigai Deepam Issue: మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు సీఎస్, డీజీపీ, కలెక్టర్‌తో పాటు ఆలయ ట్రస్టీలకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. కొండపై ఆలయం, దర్గా భద్రతను సీఆర్‌పీఎఫ్‌కు అప్పగిస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది.

Madurai: తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ
Supreme Court On Madurai Karthigai Deepam Issue
Rajashekher G
|

Updated on: Nov 27, 2026 | 4:12 PM

Share

Supreme Court On Madurai Karthigai Deepam Issue: తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. తమిళనాడు ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా స్పందించింది. చట్టాన్ని గౌరవించాల్సిన అధికారులు, రాజకీయ పెద్దల ఆదేశాల మేరకు వ్యవహరించడం సరికాదని స్పష్టం చేసింది.

కార్తీక దీపం వెలిగించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీ, జిల్లా కలెక్టర్‌తో పాటు నలుగురు ఆలయ ట్రస్టీలకు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు రాష్ట్ర సీఎస్ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

ట్రస్టీలు అనుమతించకపోవడంతో కొండపై దీపం వెలిగించలేకపోయామని కలెక్టర్ కోర్టుకు వివరణ ఇచ్చి క్షమాపణలు తెలిపారు. అయితే, కలెక్టర్ క్షమాపణతో తాము సంతృప్తి చెందలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వుల అమలులో పోలీసులు విఫలమయ్యారని పేర్కొంది.

కోర్టు ఆదేశాలను అతిక్రమించే అధికారం ఎవరికీ లేదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. తమిళనాడు ప్రభుత్వం రూల్ ఆఫ్ లా పాటించడం లేదని మండిపడింది. ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులపై బేరసారాలకు తావులేదని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడాన్ని సహించబోమని పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్టీలపై తీవ్ర చర్యలు తీసుకుంటూ వారిని సస్పెండ్ చేసింది. తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ఆలయం, దర్గా భద్రతను సీఆర్‌పీఎఫ్‌కు అప్పగించాలని ఆదేశించింది. దర్గాకు కూడా తగిన భద్రత కల్పించాలని స్పష్టం చేసింది.

Follow Us
కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..
కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..
రూమ్ నెం. 7లో ఏముంది? ఇవాళే OTTలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్
రూమ్ నెం. 7లో ఏముంది? ఇవాళే OTTలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్
టీమిండియాపై కివీస్ వికెట్ కీపర్ అరుదైన ఘనత
టీమిండియాపై కివీస్ వికెట్ కీపర్ అరుదైన ఘనత
100 కిలోల బరువు ఉన్న నన్ను 500 మీటర్లు ఎత్తుకుని పరిగెత్తాడు..
100 కిలోల బరువు ఉన్న నన్ను 500 మీటర్లు ఎత్తుకుని పరిగెత్తాడు..
హిందూ క్యాలెండర్‌లో 12 నెలల పేర్లు ఎలా వచ్చాయి? దీని వెనుక ఖగోళ..
హిందూ క్యాలెండర్‌లో 12 నెలల పేర్లు ఎలా వచ్చాయి? దీని వెనుక ఖగోళ..
ఉద్యోగం మారే ప్రయత్నాల్లో వీరు సక్సెస్! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఉద్యోగం మారే ప్రయత్నాల్లో వీరు సక్సెస్! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
JBL కొత్త ఇయర్‌బడ్స్ లాంఛ్ .. కొత్త లుక్, కిర్రాక్ ఫీచర్స్ !
JBL కొత్త ఇయర్‌బడ్స్ లాంఛ్ .. కొత్త లుక్, కిర్రాక్ ఫీచర్స్ !
ఈఐఎంలు కడుతున్నారా? నటుడు హర్షవర్ధన్ మనీ సేవింగ్ టిప్స్
ఈఐఎంలు కడుతున్నారా? నటుడు హర్షవర్ధన్ మనీ సేవింగ్ టిప్స్
నాన్న నెల రోజులు కోమాలోకి వెళ్లడానికి కారణం ఇదే..
నాన్న నెల రోజులు కోమాలోకి వెళ్లడానికి కారణం ఇదే..
ఐదు సిక్సర్లు.. ఒక వికెట్.. చివరి ఓవర్లో అసలైన టీ20 మజా
ఐదు సిక్సర్లు.. ఒక వికెట్.. చివరి ఓవర్లో అసలైన టీ20 మజా
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే