రుణగ్రహీతలకు షాక్..పెరగనున్న EMI భారం ??
ఆర్‌బీఐ రెపో రేటు స్థిరంగా ఉంచినా, బ్యాంకుల నిధుల కొరత కారణంగా రుణ వడ్డీ రేట్లు, ఈఎంఐలు పెరిగే అవకాశం ఉంది. అప్పుల వృద్ధి ఎక్కువై, డిపాజిట్లు తగ్గడంతో బ్యాంకులు డిపాజిట్ రేట్లు పెంచకతప్పదు. ఇది సీనియర్ సిటిజన్లకు, కొత్త పెట్టుబడిదారులకు శుభవార్త కాగా, రుణగ్రహీతలకు భారం. ముడి చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగి, వడ్డీ రేట్ల కోత ఆలస్యం కావచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల జరిగిన ద్రవ్య పరపతి సమీక్షలో రెపో రేటును 5.25 శాతం వద్ద స్థిరంగా ఉంచినప్పటికీ, సామాన్యుడి జేబుకు మాత్రం చిల్లు పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచకపోయినా, బ్యాంకులు మాత్రం తమ రుణ వడ్డీ రేట్లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బ్యాంకింగ్ వ్యవస్థలో ఏర్పడిన నగదు లభ్యత కొరత. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో అప్పుల వృద్ధి ఎక్కువగా ఉంటే, డిపాజిట్ల వృద్ధి తక్కువగా ఉంది. అంటే బ్యాంకుల వద్ద ఉన్న డబ్బులో సుమారు 83 శాతం ఇప్పటికే అప్పుల రూపంలో బయటకు వెళ్ళిపోయింది. మార్చి ఆఖరికి బ్యాంకింగ్ వ్యవస్థలో రూ. 65,900 కోట్ల మేర నగదు లోటు ఏర్పడింది. కొత్తగా రుణాలు ఇవ్వాలంటే బ్యాంకుల వద్ద తగినంత నిధులు లేవు. ప్రజలు ఇప్పుడు తమ పొదుపును 6.5 నుంచి 8 శాతం వడ్డీ ఇచ్చే బ్యాంకు ఎఫ్‌డీల కంటే, 12 నుంచి 13 శాతం రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్ వైపు మళ్లిస్తున్నారు. నెలకు దాదాపు రూ. 28,000 కోట్లు సిప్ (SIP) రూపంలో మార్కెట్లోకి వెళ్తుండటం బ్యాంకులకు తలనొప్పిగా మారింది. అటు సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ వంటి ప్రభుత్వ పథకాలు కూడా అధిక వడ్డీ ఇస్తుండటంతో బ్యాంకులు డిపాజిట్ల కోసం పోటీ పడాల్సి వస్తోంది. ఒకవేళ నిధులను ఆకర్షించేందుకు బ్యాంకులు డిపాజిట్ రేట్లను పెంచితే, ఆ భారం ఆటోమేటిక్‌గా రుణగ్రహీతలపై పడుతుంది. బ్యాంకులు తమ ప్రాథమిక వడ్డీ రేటుపెంచడం వల్ల ఇల్లు, కారు రుణాల EMIలు పెరిగే అవకాశం ఉంది. రాబోయే 1, 2 నెలల్లో ఎఫ్‌డీ రేట్లు 25 నుండి 50 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. ఇది సీనియర్ సిటిజన్లకు, కొత్తగా పెట్టుబడి పెట్టేవారికి శుభవార్త. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం ఎగబాకవచ్చు. ఇదే జరిగితే వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండకపోవచ్చు. అప్పు తీసుకోవాలనుకునే వారు వడ్డీ రేట్లు మరింత పెరగకముందే త్వరపడటం మంచిది. అదేవిధంగా, డిపాజిట్ చేయాలనుకునే వారు వడ్డీ రేట్లు పెరిగే వరకు కొన్ని రోజులు వేచి చూడటం మంచిదంటున్నారు ఆర్ధిక నిపుణులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రీమ్ బిస్కెట్ కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే..!
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా వెనక్కి తగ్గని మహిళా సిబ్బంది.. చివరకు
ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు
నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా కల్పన రికార్డు
ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే
పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్
నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్

