ఇల్లు కొనడానికి పీఎఫ్ డబ్బులు తీస్తున్నారా? ఈ వార్త మీకోసమే!
సొంతింటి కోసం ఈపీఎఫ్ ఖాతా నుంచి రూ.50 లక్షలు ఉపసంహరించుకునే ముందు ఒకసారి ఆలోచించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం లభిస్తున్న 8.25% చక్రవడ్డీ ప్రయోజనాన్ని కోల్పోతే 20 ఏళ్లలో సుమారు రూ.2.44 కోట్ల రాబడి దూరమవుతుందని హెచ్చరిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పాక్షికంగా పీఎఫ్ విత్‌డ్రా చేయాలని, పదవీ విరమణ భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
సొంతింటి కల నెరవేర్చుకోవడానికి మీ ఈపీఎఫ్ ఖాతా నుంచి రూ. 50 లక్షలు ఉపసంహరించుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఆర్థిక నిపుణులు ఇస్తున్న హెచ్చరికను తప్పక తెలుసుకోవాలి. అత్యవసరం లేకుండా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తే పదవీ విరమణ నాటికి మీరు భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌పై లభిస్తున్న 8.25% వడ్డీ పూర్తి పన్ను మినహాయింపుతో కూడుకున్నది. ఒకవేళ మీరు ఖాతా నుంచి రూ. 50 లక్షలు విత్‌డ్రా చేస్తే, చక్రవడ్డీ ప్రభావం వల్ల తదుపరి 20 ఏళ్లలో ఏకంగా రూ. 2.44 కోట్ల రాబడిని కోల్పోతారు. అదే సమయంలో, బ్యాంకు నుంచి 8% వడ్డీకి 20 ఏళ్లకు రూ. 50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే మీరు చెల్లించే మొత్తం వడ్డీ సుమారు రూ.50.37 లక్షలు మాత్రమే. హోమ్ లోన్ వడ్డీ కంటే పీఎఫ్ విత్‌డ్రా వల్ల భవిష్యత్తులో కోల్పోయే నిధి ఐదు రెట్లు ఎక్కువ! 30లలో ఉన్నవారు లేదా పదవీ విరమణ పొదుపు కోసం పీఎఫ్ పైనే ఆధారపడేవారు ఈ డబ్బుల జోలికి వెళ్లకపోవడమే మంచిది. డౌన్ పేమెంట్ కొరత ఉన్నప్పుడు లేదా బ్యాంకు రుణం లభించని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పీఎఫ్ అనేది ప్రాథమికంగా మీ పదవీ విరమణ భద్రత కోసమేనని గుర్తుంచుకోండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓరి మీ కక్కుర్తి కూలా.. ఇదేం పనిరా సామీ!
ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్
గుడ్‌న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఎల్పీజీ సిలిండర్ డెలివరీ!
అంతరిక్షంలో మెరిసిన తొలి భారత వజ్రం.. విక్రమ్-1తో స్కైరూట్ చరిత్ర!
భోగాపురంలో అదిరిపోయేలా ఏర్పాట్లు.. రేయింబవళ్లు కష్టపడుతున్న యంత్రాంగం
ఓరి మీ కక్కుర్తి కూలా.. ఇదేం పనిరా సామీ!
వాట్ ఏన్ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!
లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!
ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల
తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..
పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!

