అంతరిక్షంలో మెరిసిన తొలి భారత వజ్రం.. విక్రమ్-1తో స్కైరూట్ చరిత్ర!
హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ‘మిషన్ ఆగమన్’లో భాగంగా ప్రయోగించిన విక్రమ్-1 రాకెట్ ద్వారా దేశంలోనే తొలిసారిగా ల్యాబ్‌లో తయారైన వజ్రాన్ని అంతరిక్షంలోకి పంపింది. 32 ల్యాబ్ గ్రోన్ వజ్రాలతో రూపొందించిన ఈ ప్రత్యేక నమూనా సూర్యకాంతిలో మెరుస్తూ భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఈ వినూత్న ప్రయోగం దేశీయ ఏరోస్పేస్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది.
భారత ప్రైవేట్ ఏరోస్పేస్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ‘మిషన్ ఆగమన్’ ద్వారా ప్రయోగించిన ‘విక్రమ్-1’ ఆర్బిటల్ రాకెట్‌లో.. ల్యాబ్‌లో తయారు చేసిన వజ్రాన్ని అంతరిక్షంలోకి పంపారు. సూరత్‌కు చెందిన ‘నిత్యాస్ జెమ్స్ అండ్ జువెలరీ’ సీఈఓ రజనీకాంత్ ఛాంద్‌చద్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ అరుదైన ప్రయోగం కోసం 20 మంది నిపుణులు దాదాపు 6 నెలల పాటు శ్రమించి తామరపువ్వు ఆకారంలో ప్రత్యేక డిజైన్ రూపొందించారు. మొత్తం 16.95 క్యారెట్లు కలిగిన 32 పియర్ కట్ ల్యాబ్ గ్రోన్ వజ్రాలతో దీనిని అమర్చారు. దీని విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుంది. రాకెట్ తీవ్రమైన కదలికలు, అంతరిక్షంలో ఉండే విపరీతమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ప్లేట్‌పై వీటిని భద్రపరిచారు. అంతరిక్షంలో సూర్యకిరణాలు పడినప్పుడల్లా ఈ వజ్రం అద్భుతమైన కాంతులతో మెరుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగంలో రత్నాల ప్రదర్శన జరగడం దేశంలోనే ఇదే తొలిసారి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భోగాపురంలో అదిరిపోయేలా ఏర్పాట్లు.. రేయింబవళ్లు కష్టపడుతున్న యంత్రాంగం
Elon Musk: ఎలాన్ మస్క్ మరో సూపర్ ప్లాన్.. X Moneyతో యాప్‌లోనే పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు!
వాట్ ఏన్ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!
లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!
ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల
తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..
పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

