సోషల్ మీడియాలో గత్తరలేపుతున్న యంగ్ హీరోయిన్.. చీరలో స్టన్నింగ్

Rajitha Chanti

Pic credit - Instagram

11 April 2026

ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరోయిన్లలో కుషిత కల్లపు ఒకరు. ప్రస్తుతం ఈ అమ్మడు అవకాశాలు అందుకుంటుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అచ్చ తెలుగమ్మాయిగా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియా నుంచి సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చి తెగ ఫేమస్ అవుతుంది ఈ అమ్మడు.

కుషిత కల్లపు.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. ప్రస్తుతం చీరకట్టులో షేర్ చేసిన ఫోటోషూట్స్ ఇప్పుడు నెటిజన్లకు మెంటలెక్కిస్తున్నాయనే చెప్పాలి.

2023లో నీతోనే నేను అనే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత చాంగురే బంగారు రాజా, మనోహరం వంటి సినిమాల్లో నటించింది.

2024లో బాబు అనే సినిమాలో కనిపించింది. చిరంజీవ చిత్రంతోపాటు 3 రోజేస్ అనే వెబ్ సిరీస్ ద్వారా చాలా పాపులర్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది.

బోల్డ్ సీన్స్ చేయడానికి రెడీగా ఉన్నారా అని గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ చేయనని.. బోల్డ్ సీన్స్ మాత్రమే చేస్తానని తెలిపింది. 

లిప్ లాక్ సీన్స్ చేయడానికి ఇంట్లో ఒప్పుకోరని ... తనకు కూడా అలాంటివి ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. ఎంత పేరు వచ్చినా అలాంటి సీన్స్ మాత్రం చేయనని తెలిపింది.

ప్రస్తుతం కుషిత షేర్ చేసిన శారీ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ చేస్తూ ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా ప్రపంచంలో బిజీ అవుతుంది కుషిత.