CSK vs DC Playing XI: టాస్ ఓడిన చెన్నై టీం.. ప్లేయింగ్ 11లో ధోని లేడుగా..
చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ రెండు మార్పులు చేసింది. నితీష్ రాణా, విప్రజ్ నిగమ్‌ల స్థానంలో ఆకిబ్ నబీ, అశుతోష్ శర్మ జట్టులోకి వచ్చారు. మరోవైపు, చెన్నై ఇద్దరు ఆటగాళ్లను తీసుకువచ్చింది. గుర్జప్‌నీత్ సింగ్, డెవాల్డ్ బ్రెవిస్ నేటి మ్యాచ్ ఆడుతున్నారు.

Chennai Super Kings vs Delhi Capitals, 18th Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌లో ఈరోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మధ్య జరుగుతోంది. చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ రెండు మార్పులు చేసింది. నితీష్ రాణా, విప్రజ్ నిగమ్‌ల స్థానంలో ఆకిబ్ నబీ, అశుతోష్ శర్మ జట్టులోకి వచ్చారు. మరోవైపు, చెన్నై ఇద్దరు ఆటగాళ్లను తీసుకువచ్చింది. గుర్జప్‌నీత్ సింగ్, డెవాల్డ్ బ్రెవిస్ నేటి మ్యాచ్ ఆడుతున్నారు.
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లేకుండా సీఎస్కే ఈరోజు ఆడనుంది. చెన్నై జట్టు మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. మరోవైపు, అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఆ జట్టు గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓటమిని చవిచూసింది.
జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్ (కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఔకిబ్ నబీ దార్, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్.
