
ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ క్యాపిటల్స్ (గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్) ఒక ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఈ ఫ్రాంచైజీ GMR గ్రూప్, JSW స్పోర్ట్స్ యాజమాన్యంలో ఉంది. న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం (గతంలో ఫిరోజ్ షా కోట్లా) జట్టు హోమ్ గ్రౌండ్. జట్టుకు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్, కోచ్ రికీ పాంటింగ్ ఉన్నారు. రిషబ్ పంత్ ప్రమాదానికి గురై గాయపడినప్పటి నుంచి డేవిడ్ వార్నర్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈసారి 2024లో రిషబ్ పంత్ ఐపీఎల్లో కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఢిల్లీ ఫ్రాంచైజీలో కెప్టెన్ డేవిడ్ వార్నర్, కోచ్ రికీ పాంటింగ్, ఛైర్మన్ పార్థ్ జిందాల్, బ్యాటింగ్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే, బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్, ఫీల్డింగ్ కోచ్ బిజు జార్జ్, ఓనర్ JSW స్పోర్ట్స్ ( 50%), GMR స్పోర్ట్స్ (50%), మేనేజర్ సిద్ధార్థ్ భాసిన్ ఉన్నారు.
డిసెంబర్ 2018లో, జట్టు పేరు ఢిల్లీ డేర్‌డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌గా మారింది. జట్టు జెర్సీ రంగులు నీలం, ఎరుపు. ఢిల్లీ క్యాపిటల్స్ 2020లో తొలిసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇంకా టైటిల్‌ను గెలవలేదు.
IPL 2025: 9 కోట్లు పెట్టి నెత్తినెక్కించుకున్నారు.. కట్ చేస్తే.. DC కి ప్లాప్ షో చూపిస్తున్న మరో ఆసీస్ ప్లేయర్
ఐపీఎల్ 2025 సీజన్లో జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (JFM) డిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అంచనాల ప్రకారం ప్రదర్శించలేకపోయాడు. 9 కోట్లు వెచ్చించి అతనిని కొనుగోలు చేసిన DC, సీజన్ 2024 లో మంచి ఆటతీరుతో కనుమరుగైన జేక్‌ను 2025లో ఫ్లాప్ గా చూసింది. మొదటి 6 మ్యాచ్‌లలో అతని కష్టాలు కొనసాగడం DC జట్టుకు ఒక నిరాశను కలిగించాయి. JFM ఆటశైలి, అతనికి ఈ సీజన్లో చేదు అనుభవంగా మారింది.
- Narsimha
- Updated on: Apr 17, 2025
- 2:36 pm
IPL 2025: గాయంతో వెనుతిరిగిన రాజస్థాన్ కెప్టెన్! ఫిట్నెస్ పై కీలక అప్డేట్! నెక్స్ట్ మ్యాచ్ లో ఉంటాడా భయ్యా?
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ కెప్టెన్ సంజు సామ్సన్ గాయపడడం మ్యాచ్‌కు కీలక మలుపుగా నిలిచింది. 31 పరుగులు చేసిన తర్వాత రిటైర్డ్ హర్ట్ కావడం జట్టుకు ఎదురుదెబ్బ అయ్యింది. అయినా చివరి ఓవర్లో మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్ చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లాడు. సంజు గాయం పెద్దది కాదని తెలిపినా, నెక్స్ట్ మ్యాచ్‌లో ఆయన ఆడతాడా అన్నది ఇంకా ఉత్కంఠతో ఉంది.
- Narsimha
- Updated on: Apr 17, 2025
- 12:59 pm
IPL 2025: రాజస్థాన్ కొంపముంచిన ఆ ఒక్క ఓవర్.. చెత్త రికార్డుల లిస్ట్ లో మొత్తం మనోళ్లే!
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్క ఓవర్లో 11 బంతులు వేసి, అత్యధిక బంతులు వేసిన భారత బౌలర్ల జాబితాలో చేరిపోయాడు. నో బాల్స్, వైడ్లు వరుసగా వేసిన సందీప్, ఢిల్లీ జట్టుకు పెద్ద స్కోరు చేయడానికి దారి తీసాడు. ఈ ఓవర్ అతని కెరీర్లో చెరగని ముద్ర వేసింది.
- Narsimha
- Updated on: Apr 17, 2025
- 12:20 pm
IPL 2025: నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్లో సూపర్ ఓవర్.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఢిల్లీ విక్టరీ!
ఐపీఎల్ 2025లో బుధవారం ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరిగింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య తొలి సూపర్ ఓవర్ మ్యాచ్ జరగ్గా..ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 2021 ఐపీఎల్లో జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌లో ఢిల్లీనే విజయం సాధించగా.. నాలుగేళ్ల తర్వాత జరిగిన తొలి సూపర్ ఓవర్ మ్యాచ్‌లోనూ ఢిల్లీనే గెలిచింది.
- Anand T
- Updated on: Apr 17, 2025
- 9:14 am
DC vs RR Preview: గత మ్యాచ్‌ల్లో ఓటమి.. కట్‌చేస్తే.. ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోనున్న పింక్ పాంథర్?
Delhi Capitals vs Rajasthan Royals Preview: ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య చాలా కఠినమైన పోటీ ఉంది. ఇప్పటివరకు ఆ రెండు జట్ల మధ్య మొత్తం 29 మ్యాచ్‌లు జరగగా, ఢిల్లీ 14 సార్లు, రాజస్థాన్ 15 సార్లు గెలిచింది. ఐపీఎల్ 2024 సమయంలో ఇరుజట్ల చెరో మ్యాచ్ గెలిచాయి.
- Venkata Chari
- Updated on: Apr 16, 2025
- 7:44 am
Video: ఇదెక్కడి ఫైటింగ్ రా మావా! DC vs MI మ్యాచ్ మధ్యలో పురుషుడిని చితక్కొట్టిన మహిళ
ఏప్రిల్ 13న ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ముంబై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ స్టేడియంలో ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగిన ఘర్షణే ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. ఈ గొడవ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసి 205/5 పరుగులు చేసింది. తిలక్ వర్మ అద్భుతంగా ఆడుతూ 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ కూడా విలువైన పరుగులు అందించారు. డీసీ బౌలింగ్ వైపుగా కుల్దీప్ యాదవ్, విప్రజ్ నిగమ్ చెరో రెండు వికెట్లు తీసి మెరిశారు.
- Narsimha
- Updated on: Apr 14, 2025
- 5:50 pm
Rohit Sharma: దటీజ్ రోహిత్.. డగౌట్ నుంచే ఢిల్లీపై మరణ శాసనం.. బ్రహ్మ రాతనే మార్చేసిన హిట్‌మ్యాన్
Rohit Sharma one decision Change DC vs MI Result: రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్ కాకపోవచ్చు. కానీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదే పాత్రలో కనిపించాడు. రోహిత్ మైదానంలో లేకపోయినా, డగౌట్లో కూర్చుని ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ఒకే ఒక్క నిర్ణయంతో ఎవ్వరూ ఫలితాన్ని రాబట్టాడు.
- Venkata Chari
- Updated on: Apr 14, 2025
- 9:45 am
Video: బుమ్రా అహాన్ని దెబ్బతీసిన నాయర్.. కట్‌చేస్తే మైదానంలో గొడవ.. రోహిత్ ఎక్స్ప్రెషన్స్ నెక్ట్స్ లెవల్
Jasprit Bumrah fight with Karun Nair: ఐపీఎల్ 2025లో గాయం తర్వాత తిరిగి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా ప్రత్యేకంగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తాజాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. కరుణ్ నాయర్ దెబ్బకు సహనం కోల్పోయిన బుమ్రా.. మైదానం మధ్యలో గొడవపడ్డాడు.
- Venkata Chari
- Updated on: Apr 14, 2025
- 9:10 am
IPL 2025 Points Table: ఢిల్లీ అగ్రస్థానానికి 3 బంతుల్లో చెక్ పెట్టేసిన ముంబై.. కట్‌చేస్తే గుజరాత్‌కు లక్కీ ఛాన్స్
IPL 2025 Points Table updated after DC vs MI: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎట్టకేలకు 4 విజయాల తర్వాత మొదటి ఓటమి ఎదుర్కొంది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నుంచి పడిపోయింది. ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది.
- Venkata Chari
- Updated on: Apr 14, 2025
- 7:40 am
DC vs MI Match Report: W,W,W.. 3 బంతుల్లో మారిన ముంబై ఫేట్.. ఢిల్లీ తొలి ఓటమి
ఆదివారం జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. 19వ ఓవర్లో, ముంబై జట్టు వరుస బంతుల్లో ముగ్గురు ఢిల్లీ బ్యాట్స్మెన్లను రనౌట్ చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ ఓవర్లో అశుతోష్ శర్మ, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మలు ఔటయ్యారు.
- Venkata Chari
- Updated on: Apr 13, 2025
- 11:36 pm