మాజీ మంత్రి, సీనియర్ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్లోని ఆస్పత్రిలో చేరారు. బీపీ అధికమవ్వడం, నీరసంగా అనిపించడంతో ముందస్తు జాగ్రత్తగా వైద్య పరీక్షల నిమిత్తం కుటుంబ సభ్యులు ఆయన్ను తరలించారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆదివారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని కుమార్తె అనూష తెలిపారు. పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.