కామారెడ్డి జిల్లాలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఓ దొంగను స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నర్సింహా రెడ్డి మెడలో నుంచి గొలుసు లాగేందుకు ప్రయత్నించగా, బాధితుడి కేకలతో అప్రమత్తమైన ప్రజలు దొంగను పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.