గిద్దలూరులోని మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయం వద్ద కస్టమర్లు నిరసన వ్యక్తం చేశారు. తాకట్టు పెట్టిన 37 గ్రాముల కేడీఎం బంగారం మార్చేశారని ఒక కుటుంబం ఆరోపించింది. అప్పు చెల్లించినా తమ అసలు బంగారాన్ని ఇవ్వకుండా వేరే వస్తువు ఇస్తామన్నారని వారు మండిపడ్డారు. పోలీసుల నుండి న్యాయం జరగకపోవడంతో మీడియాను ఆశ్రయించారు.