2సార్లు హ్యాండిచ్చారని కోపంతో ఊగిపోయాడు.. 3వసారి ఊహించని ట్విస్ట్.. కట్‌చేస్తే.. యూటర్న్‌తో సెన్సేషన్
Prithvi Shaw: ఢిల్లీ జట్టు తనను కొనుగోలు చేసిందని తెలియగానే పృథ్వీ షా స్పందన పూర్తిగా మారిపోయింది. వెంటనే తన పాత 'సాడ్ స్టోరీ'ని డిలీట్ చేశాడు. కేవలం ఆరు నిమిషాల వ్యవధిలోనే, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌తో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. "బ్యాక్ టు మై ఫ్యామిలీ" (తిరిగి నా కుటుంబం వద్దకు) అని హార్ట్ ఎమోజీతో కొత్త పోస్ట్ పెట్టాడు.

Prithvi Shaw: క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురిచేసిన ఐపీఎల్ 2026 వేలంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా విషయంలో వేదిక బయట సోషల్ మీడియాలో చిన్నపాటి డ్రామా నడిచింది. రెండు సార్లు వేలంలోకి వచ్చినా అమ్ముడుపోని షా, చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ క్రమంలో అతను చేసిన సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయ్యాయి.
రెండు సార్లు నిరాశ..
వేలం ప్రారంభంలో పృథ్వీ షా తన కనీస ధర రూ. 75 లక్షలతో బరిలోకి దిగాడు. కానీ మొదటి రౌండ్‌లో ఏ ఫ్రాంచైజీ కూడా అతనిపై ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత అన్‌సోల్డ్ ప్లేయర్స్ (అమ్ముడుపోని ఆటగాళ్లు) జాబితాలో మరోసారి అతని పేరు వచ్చింది. అప్పుడు కూడా ఎవరూ బిడ్ వేయలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన పృథ్వీ షా, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “ఇట్స్ ఓకే” (It’s Ok) అని రాస్తూ, పగిలిన గుండె (Heartbreak) ఎమోజీని పోస్ట్ చేశాడు. ఇది అభిమానులలో చర్చనీయాంశమైంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ట్విస్ట్..
Prithvi Shaw at 9:10 PM: uploaded a sad story after going unsold even in Round 2.
9:17 PM: sold to DC for ₹75L in round 3.
Story deleted. God’s plan. 🤩 pic.twitter.com/463IFPhuDX
— Dinda Academy (@academy_dinda) December 16, 2025
వేలం చివరి దశకు చేరుకున్నాక అనూహ్య మలుపు చోటుచేసుకుంది. మూడోసారి పృథ్వీ షా పేరును వేలంలోకి తెచ్చారు. ఈసారి అతని పాత ఫ్రాంచైజీ ‘ఢిల్లీ క్యాపిటల్స్’ రూ. 75 లక్షల కనీస ధరకు అతన్ని దక్కించుకుంది. 2018 నుంచి 2024 వరకు షా ఢిల్లీ జట్టుకే ఆడటం విశేషం.
సోషల్ మీడియాలో ‘యూ-టర్న్’..
Prithvi Shaw’s insta Story.🇮🇳♥️#PrithviShaw #iplauction2026 pic.twitter.com/uKcu39adKb
— Cricket Sangrah (@CricketSangrah) December 16, 2025
ఢిల్లీ జట్టు తనను కొనుగోలు చేసిందని తెలియగానే పృథ్వీ షా స్పందన పూర్తిగా మారిపోయింది. వెంటనే తన పాత ‘సాడ్ స్టోరీ’ని డిలీట్ చేశాడు. కేవలం ఆరు నిమిషాల వ్యవధిలోనే, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌తో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. “బ్యాక్ టు మై ఫ్యామిలీ” (తిరిగి నా కుటుంబం వద్దకు) అని హార్ట్ ఎమోజీతో కొత్త పోస్ట్ పెట్టాడు. నిమిషాల్లోనే బాధ నుంచి ఆనందంలోకి మారిన పృథ్వీ షా వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొత్తానికి, పృథ్వీ షా ఐపీఎల్ ప్రయాణం కాస్త ఉత్కంఠ మధ్య సుఖాంతమైంది. పాత గూటికే చేరిన ఈ ముంబై బ్యాటర్, వచ్చే సీజన్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




