AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramadan Holidays: మార్చి 19 నుంచి 23 వరకు రంజాన్‌ సెలవులు ప్రకటన.. అక్కడి ఉద్యోగులకు ఏకంగా 5 రోజులు సెలవులు

ఒమన్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగులకు మార్చి 19 నుంచి మార్చి 23 సోమవారం వరకు సెలవులు మంజూరు తన ప్రకటనలో తెలిపింది. సెలవులు ముగిసిన తర్వాత మార్చి 24 నుంచి సాధారణ పనిదినాలు తిరిగి ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ముగింపును..

Ramadan Holidays: మార్చి 19 నుంచి 23 వరకు రంజాన్‌ సెలవులు ప్రకటన.. అక్కడి ఉద్యోగులకు ఏకంగా 5 రోజులు సెలవులు
Oman Ramadan Holidays
Srilakshmi C
|

Updated on: Mar 13, 2026 | 8:46 AM

Share

దుబాయ్‌, మార్చి 13: ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒమన్ ప్రభుత్వం రంజాన్ సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగులకు మార్చి 19 నుంచి మార్చి 23 సోమవారం వరకు సెలవులు మంజూరు తన ప్రకటనలో తెలిపింది. సెలవులు ముగిసిన తర్వాత మార్చి 24 నుంచి సాధారణ పనిదినాలు తిరిగి ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ముగింపును సూచించే ఈద్ అల్ ఫితర్‌ను సాంప్రదాయకంగా ఉదయం ప్రత్యేక ప్రార్థనలు, కుటుంబ సందర్శనలు, దానధర్మాలు, పండుగ భోజనాలతో జరుపుకుంటారు. ఈ పండగ ఒక నెల ఉపవాసం తర్వాత చివరి రోజు తెల్లవారుజాము నుంచి సూర్యాస్తమయం వరకు కరుణ, సామాజిక సంఘీభావం, కృతజ్ఞతా విలువలతో జరుపుకుంటారు. ఈ ఏడాది రంజాన్ చాలా దేశాలలో 30 రోజులు పూర్తి అవుతుందని మత పెద్దలు చెబుతున్నారు. దీంతో ఈద్ అల్ ఫితర్ మార్చి 20 (శుక్రవారం) వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున చంద్రుడి దర్శనం అవుతుంది.

అయితే ఒమన్‌లో కాస్త ముందుగా రంజాన్‌ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. అక్కడ 19 ఫిబ్రవరి 2026 (గురువారం)న సుల్తానేట్‌లో రంజాన్ మొదటి రోజు ప్రారంభమైంది. అనేక ఇతర గల్ఫ్ దేశాలు ఫిబ్రవరి 18 బుధవారం నుంచి ఉపవాసం ప్రారంభించాయి. ఈ వ్యత్యాసం ఏందుకంటే ఈ ప్రాంతం అంతటా శుక్రవారం నాడు ఈద్ నిర్ధారణ అవుతుంది. దీంతో ఒమన్‌లో మాత్రమే 29 రోజుల ఉపవాసం జరుగుతంది. ఒక రోజు ముందుగా రంజాన్ ప్రారంభించిన దేశాలు పూర్తి 30 రోజుల ఉపవాసాన్ని పూర్తి చేస్తాయి.

మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో కూడా ఈ ఏడాది ఈద్ అల్-ఫితర్ సందర్భంగా సెలవులను ముందుగానే ప్రకటించింది. ప్రైవేట్ ఉద్యోగులకు మార్చి 19 నుంచి 21 వరకు మూడు రోజుల సెలవులు ఇచ్చారు. రంజాన్ నెల 30 రోజులు జరుపుకునే దేశాలకు మార్చి 22 వరకు ఈ సెలవులు పొడిగించే అవకాశం ఉంది. దీంతో ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు సెలవులు ఉంటాయి. వీరికి మార్చి 23 నుంచి తిరిగి పని దినాలు ప్రారంభమవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us