లక్ష్మీదేవి కటాక్షం కావాలా..? శుక్రవారం ఈ పనులు అసలు చేయకండి..!
Friday Lakshmi Puja: మన సనాతన సంప్రదాయాల ప్రకారం శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవిని ఆరాధించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీ స్తోత్రం పఠించడం, పూజలు చేయడం వల్ల ఇంటికి సంపద, వైభవం, శ్రేయస్సు వస్తాయని నమ్మకం. అంతేకాకుండా ఈ రోజు మంచి పనులు చేయాలని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా దానధర్మాలు చేయడం అత్యంత శ్రేష్ఠంగా భావిస్తారు.

సనాతన ధర్మంలో వారంలోని ప్రతి రోజుకూ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా శుక్రవారం రోజును మహాలక్ష్మీదేవికి అంకితం చేసిన రోజుగా భావిస్తారు. లక్ష్మీదేవిని సంపద, ఐశ్వర్యాల దేవతగా పూజిస్తారు. అమ్మవారి కృప కలిగిన వారికి జీవితంలో ధనం, ధాన్యం లోటు ఉండదని విశ్వాసం ఉంది. అందుకే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు, నియమాలు పాటిస్తారు. మీరు కూడా అమ్మవారి అనుగ్రహం పొందాలనుకుంటే శుక్రవారం రోజున లక్ష్మీ చాలీసా పఠించడం మంచిదిగా భావిస్తారు. ఇలా పఠించడం వల్ల ఆర్థిక శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం.
ఆనందం, ఐశ్వర్యం
లక్ష్మీదేవి హృదయపూర్వకంగా ఆరాధించే భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతుందని విశ్వసిస్తారు. నిర్మలమైన మనస్సుతో అమ్మవారిని పూజిస్తే జీవితంలోని సమస్యలు తొలగి, ఆనందం, శాంతి, ఐశ్వర్యం లభిస్తాయని ఆధ్యాత్మిక విశ్వాసం.
శుభప్రదం, అత్యంత శ్రేష్ఠం
మన సనాతన సంప్రదాయాల ప్రకారం శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవిని ఆరాధించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీ స్తోత్రం పఠించడం, పూజలు చేయడం వల్ల ఇంటికి సంపద, వైభవం, శ్రేయస్సు వస్తాయని నమ్మకం. అంతేకాకుండా ఈ రోజు మంచి పనులు చేయాలని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా దానధర్మాలు చేయడం అత్యంత శ్రేష్ఠంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమై ఎల్లప్పుడూ సంపన్నత కలగాలని ఆశీర్వదిస్తుందని చెబుతారు.
లక్ష్మీదేవికి ఆగ్రహానికి గురయ్యే ఈ పనులు చేయొద్దు
అయితే శుక్రవారం కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా పాటించాలని శాస్త్రాలు సూచిస్తాయి. కొన్ని పనులను ఈ రోజున చేయడం అశుభంగా పరిగణిస్తారు. అలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదముందని నమ్మకం.
శాస్త్రాల ప్రకారం సాయంత్రం కొంత సమయం ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలని చెబుతారు. ఎందుకంటే ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని విశ్వసిస్తారు. కాబట్టి పూజాగృహంలో దీపం వెలిగించే ముందు ఇంటి ప్రధాన తలుపులు తెరవడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుందని, కుటుంబానికి సంతోషం, సంపద కలుగుతాయని అంటారు.
దానం చేయండి కానీ..
శుక్రవారం రోజున ఎవరి నుంచి రుణం తీసుకోవడం లేదా ఇవ్వడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతాయి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్వాసం. అయితే ఎవరికైనా సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే దానంగా సహాయం చేయాలి కానీ రుణంగా ఇవ్వకూడదు.
మహిళలను అవమానించొద్దు
ఇంకా కొంతమంది ఈ రోజున వైభవ లక్ష్మీ ఉపవాసం పాటిస్తారు. ఆ రోజున చిన్నారులు లేదా అమ్మాయిలకు అన్నదానం చేస్తారు. అలాంటి సమయంలో వారిని అవమానించడం, మందలించడం లేదా తిట్టడం చేయకూడదు. వారికి గౌరవంగా ప్రవర్తించి, వారికి నచ్చిన ఆహారం ఇవ్వడం మంచిదిగా భావిస్తారు. ఎందుకంటే మహిళలను ఇంటి లక్ష్మిగా భావిస్తారు.
లక్ష్మీదేవిని ఆహ్వానిస్తే..
అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇతరులకు ఇవ్వకూడదని చెబుతారు. అయితే కొత్తగా ఇంటికి లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకురావడం మాత్రం శుభప్రదం. సాయంత్రం నియమ నిష్ఠలతో లక్ష్మీదేవిని పూజించి, తల్లిని ఇంటికి ఆహ్వానిస్తే ఇంట్లో ఐశ్వర్యం, శ్రేయస్సు పెరుగుతాయని విశ్వాసం.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని సంస్థ ధృవీకరించదు.)
